వెంకయ్యపై మండిపడుతున్న బీజేపీ కార్యకర్తలు

వెంకయ్య నాయుడుకు పార్టీ ప్రయోజనాలకన్నా తన సామాజిక వర్గ ప్రయోజనాలు ముఖ్యమయ్యాయని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడకపోవడానికి ప్రధానకారకులు వెంకయ్యేనని, బీజేపీ స్థిరపడితే టీడీపీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఒక పథకం ప్రకారం బీజేపీని దెబ్బతీస్తూ టీడీపీకి అండగా నిలబడుతున్నాడని, బీజేపీని టీడీపీకి తోక పార్టీగా మిగిలిస్తున్నాడని విమర్శిస్తున్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో తన సామాజిక వర్గానికి చెందిన అప్పారావ్‌ చౌదరిని వీసీగా నియమించడంలో వెంకయ్యనాయుడు ప్రధాన పాత్ర వహించాడని, వరుసగా నాలుగు వాక్యాలు […]

Advertisement
Update:2016-03-25 07:08 IST

వెంకయ్య నాయుడుకు పార్టీ ప్రయోజనాలకన్నా తన సామాజిక వర్గ ప్రయోజనాలు ముఖ్యమయ్యాయని బీజేపీ కార్యకర్తలు మండిపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలపడకపోవడానికి ప్రధానకారకులు వెంకయ్యేనని, బీజేపీ స్థిరపడితే టీడీపీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఒక పథకం ప్రకారం బీజేపీని దెబ్బతీస్తూ టీడీపీకి అండగా నిలబడుతున్నాడని, బీజేపీని టీడీపీకి తోక పార్టీగా మిగిలిస్తున్నాడని విమర్శిస్తున్నారు.

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో తన సామాజిక వర్గానికి చెందిన అప్పారావ్‌ చౌదరిని వీసీగా నియమించడంలో వెంకయ్యనాయుడు ప్రధాన పాత్ర వహించాడని, వరుసగా నాలుగు వాక్యాలు తప్పులు లేకుండా మాట్లాడలేని వ్యక్తి వీసీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అప్పారావు వీసీ అయినప్పటినుంచి యూనివర్శిటీలో వర్గపోరు ఎక్కువైందని, ఉద్యోగులను, విద్యార్ధులను విభజించూ పాలించూ సిద్ధాంతంతో వేరుచేసి వీసీగా నెగ్గుకొచ్చాడని అంటున్నారు. అతని దుందుడుకు ప్రవర్తనవల్లే సెంట్రల్‌యూనివర్శిటీ వివాదాలకు కేంద్రబిందువైందని చెబుతున్నారు. రోహిత్‌ ఆత్మహత్య తరువాత పరిణామాలను సమర్ధంగా పరిష్కరించలేక చిచ్చుపెట్టి తప్పుకున్నాడని మండిపడుతున్నారు.

రోహిత్‌ ఆత్మహత్యతరువాతే జేన్‌యూలో వివాదం మొదలైందని, కన్హయ్య కుమార్‌, ఉమర్‌, భట్టాచార్య ఉపన్యాసాలు బీజేపీకి చాలా నష్టం కలిగించాయని, ఇప్పుడు కన్హయ్య కుమార్ ఒక నేషనల్‌ ఫిగర్‌ అయ్యాడంటే అదంతా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో వివాదం కారణంగానే నని – ఇక సమస్యలు సర్ధుమణుగుతున్నాయి అనుకునే దశలో మళ్ళీ వీసీ అప్పారావు రంగప్రవేశం చేసి హెచ్‌సీయూలో మళ్ళీ మంటలు రాజేశాడని మండిపడుతున్నారు.

విద్యార్ధులతో సామరస్యంగా వ్యవహరించాల్సిందిపోయి తనను సపోర్టు చేసే వాళ్ల అండతో, పోలీసులను అడ్డుపెట్టుకుని మళ్లీ అతిగా వ్యవహరించాడని, వైఫై సేవలు రద్దుకావడం, కరెంట్‌ కట్‌, వాటర్‌ కట్‌ మొదలైన ఆరాచకాలు చాలవన్నట్టు తను వీసీగా వచ్చిన రెండు మూడు గంటల వ్యవధిలోనే విద్యార్ధులకు వ్యతిరేకంగా నాలుగో తరగతి ఉద్యోగులు సమ్మెకు దిగారన్న సాకు చూపి మెస్‌లు మూసేసి విద్యార్ధులకు భోజన సౌకర్యం లేకుండా చేయడం వంటి చర్యలపై రాజకీయాలతో సంబంధంలేని వ్యక్తులుకూడా వీసీ అప్పారావుపై మండిపడ్డారు. సెంట్రల్‌ యూనివర్శిటీల్లో మేధావులయిన వ్యక్తులు వీసీలుగా వుంటారు. వాళ్లు విద్యార్ధులతో ప్రవర్తించే విధానం ప్రత్యేకంగా వుంటుంది. కానీ అప్పారావు ప్రవర్తన చిల్లరగా వుంది. జేఎన్‌యూ లో దీనికన్నా ఎంతో పెద్ద గొడవలైనా వీసీ వివాదాస్పదం కాలేదు. కానీ అప్పారావు మాత్రం వివాదాస్పదుడే కాకుండా అనేక యూనివర్శిటీల్లో జరిగిన వివాదాలన్నిటికి కేంద్రబిందువు అయ్యాడు. అలాంటి వ్యక్తికి పూర్తి అండగా నిలబడి వెంకయ్యనాయుడు ఏం సాధించదలుచుకున్నాడని బీజేపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News