గంటా వర్సెస్ లోకేష్‌… నెగ్గేది ఎవరి మాట?

గంటా శ్రీనివాస్‌రావుకు ఇప్పుడో అంశం ప్రతిష్టాత్మకంగా మారింది. విద్యాశాఖ మంత్రిగా గంటాకు ఆయన శాఖపై ఉన్న పట్టుకు, స్వేచ్చకు ఆంధ్రా వీసీ నియామకం పరీక్ష పెడుతోంది. అందులోనూ ఆంధ్రా యూనివర్శిటీ గంటా సొంత జిల్లాలో ఉండడంతో పరిస్థితి ఇజ్జత్‌కా సవాల్ అన్నట్టుగా మారింది. ఇదే సమయంలో మధ్యలో లోకేష్‌ కూడా ఎంటరవడంతో గంటా ఇబ్బందిపడుతున్నారు. వీసీ పదవి కోసం రేసులో ముఖ్యంగా ఇన్‌ చార్జ్ వీసీ నారాయణ, రిజిస్ట్రార్  వెలగపూడి ఉమామహేశ్వరరావులు  పోటీపడుతున్నారు. నారాయణ… గంటా శ్రీనివాస్‌ సామాజికవర్గానికి […]

Advertisement
Update:2016-03-25 07:15 IST

గంటా శ్రీనివాస్‌రావుకు ఇప్పుడో అంశం ప్రతిష్టాత్మకంగా మారింది. విద్యాశాఖ మంత్రిగా గంటాకు ఆయన శాఖపై ఉన్న పట్టుకు, స్వేచ్చకు ఆంధ్రా వీసీ నియామకం పరీక్ష పెడుతోంది. అందులోనూ ఆంధ్రా యూనివర్శిటీ గంటా సొంత జిల్లాలో ఉండడంతో పరిస్థితి ఇజ్జత్‌కా సవాల్ అన్నట్టుగా మారింది. ఇదే సమయంలో మధ్యలో లోకేష్‌ కూడా ఎంటరవడంతో గంటా ఇబ్బందిపడుతున్నారు. వీసీ పదవి కోసం రేసులో ముఖ్యంగా ఇన్‌ చార్జ్ వీసీ నారాయణ, రిజిస్ట్రార్ వెలగపూడి ఉమామహేశ్వరరావులు పోటీపడుతున్నారు.

నారాయణ… గంటా శ్రీనివాస్‌ సామాజికవర్గానికి చెందిన వారు. ఆయనకు గంటా ఆశీస్సులు ఉండడం వల్లే ఇన్‌చార్జ్ వీసీ పదవి కూడా దక్కిందని చెబుతుంటారు. ఇప్పుడు వీసీ పదవి కూడా గంటా సాయంతో సొంతం చేసుకోవాలనుకున్నారు. కానీ హఠాత్తుగా వెలగపూడి ఉమామహేశ్వరరావు .. లోకేష్‌ సాయంతో బరిలోకి దిగారు. ఉమామహేశ్వరరావు … చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన నుంచి పోటీ తీవ్రంగా ఉంది. ఉమామహేశ్వరరావు… లోకేష్‌తో పాటు సీఎంకు సన్నిహితంగా ఉండే సామాజిక వర్గం వారి నుంచి కూడా ఆశీస్సులు పొందారు. అలా ఉమామహేశ్వరరావుకు మద్దతు పలుకుతున్న వారిలో బాలకృష్ణ బంధువు ఎంవీవీఎస్‌ మూర్తి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఉన్నట్టు చెబుతున్నారు.

అయితే ఇటీవల వర్శిటీలో నిబంధనలకు విరుద్దంగా జరిగిన నియామకాలు, పీహెచ్‌డీ పవ్రేశాల్లో ఉమామహేశ్వరరావు హస్తముందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈనేపథ్యంలోనే వీసీ ఎంపిక కోసం నియమించిన కమిటీ హైదరాబాద్‌లో సమావేశమవుతోంది. కమిటీ సమావేశం అవుతున్నప్పటికీ సీఎం ఆల్‌ రెడీ నిర్ణయించుకున్న వ్యక్తికే వీసీ పదవి దక్కుతుందని చెబుతున్నారు. చూడాలి గంటా బలపరుస్తున్న నారాయణకు పదవి వస్తుందో… లేక లోకేష్ సామాజికవర్గానికి చెందిన ఉమామహేశ్వరరావు వీసీ అవుతారో!. ఒక వేళ నారాయణకు వీసీ పదవి దక్కకపోతే సొంత జిల్లాలోని వర్శిటీలోనూ గంటా చక్రం తిప్పలేకపోయారన్న భావన ఏర్పడవచ్చు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News