‘’అదో పెద్ద పదవా? యనమల మాదిరి అయిపోతారు..’’- పెద్దిరెడ్డి

పీఏసీ పదవి తమకు దక్కకపోవడంపై వైసీపీ సీనియర్లు బహిరంగంగా మాట్లాడకపోయినా… లోలోన కాసింత అసంతృప్తిగానే ఉన్నారు. వివాదరహితుడు, ప్రతిభ ఉన్న బుగ్గనకు పదవి ఇవ్వడంతో జగన్‌ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరూ తప్పుపట్టలేని పరిస్థితి. అయితే పీఏసీ పదవి ఆశించిన జ్యోతుల నెహ్రు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథరెడ్డి కొద్దిమేర అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.ఇందుకు వారి వ్యాఖ్యలే నిదర్శనం. పీఏసీ పదవి తనకు గానీ, జ్యోతుల నెహ్రుకు గాని వస్తుందని భావించానని అయితే జగన్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని అమర్నాథరెడ్డి […]

Advertisement
Update:2016-03-23 03:55 IST

పీఏసీ పదవి తమకు దక్కకపోవడంపై వైసీపీ సీనియర్లు బహిరంగంగా మాట్లాడకపోయినా… లోలోన కాసింత అసంతృప్తిగానే ఉన్నారు. వివాదరహితుడు, ప్రతిభ ఉన్న బుగ్గనకు పదవి ఇవ్వడంతో జగన్‌ నిర్ణయాన్ని బహిరంగంగా ఎవరూ తప్పుపట్టలేని పరిస్థితి. అయితే పీఏసీ పదవి ఆశించిన జ్యోతుల నెహ్రు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అమర్నాథరెడ్డి కొద్దిమేర అసంతృప్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది.ఇందుకు వారి వ్యాఖ్యలే నిదర్శనం. పీఏసీ పదవి తనకు గానీ, జ్యోతుల నెహ్రుకు గాని వస్తుందని భావించానని అయితే జగన్‌ నిర్ణయం ఆశ్చర్యం కలిగించిందని అమర్నాథరెడ్డి అన్నారు. జ్యోతుల నెహ్రు మాత్రం ఈవిషయంపై స్పందించడం లేదు. పదవులు కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదని చెప్పారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ నేతలు, మీడియా ప్రతినిధులు పదేపదే ట్రై చేసినా ఆయన మాత్రం చాకచక్యంగానే మాట్లాడారు.

మరోసీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాత్రం కాసింత అసంతృప్తిగానే స్పందించారని ఒక తెలుగు దినపత్రిక కథనం. పీఏసీ చైర్మన్‌ అదో పెద్ద పదవా?. దానిని చేపట్టినవారెవరూ ఆ తర్వాత ప్రత్యక్షంగా ప్రజలతో ఎన్నికై ఎమ్మెల్యే కాలేదు అంటూ సెంటిమెంట్ అంశాన్ని కూడా ప్రస్తావించారట. యనమల రామకృష్ణుడు పీఏసీ చైర్మన్‌ చేశాక.. నాలుగు సార్లు ఓడిపోయారని పెద్దిరెడ్డి చెప్పినట్టు సదరు పత్రిక కథనం. ఒక విధంగా ఈ సెంటిమెంట్‌ను వైసీపీ నేతలు నమ్మితే జ్యోతుల, పెద్దిరెడ్డి, అమర్నాథరెడ్డి సంతోషించాల్సిందే.

Click on Image to Read:


Tags:    
Advertisement

Similar News