ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు మరో ఉచ్చు సిద్ధం చేసిన వైసీపీ

తమ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిపోయిన 8మంది ఎమ్మెల్యేలను వైసీపీ వదిలిపెట్టేలా లేదు. వారిపై అనర్హత వేటు వేయించేందుకు మరో ప్లాన్ చేసింది.  ఇందులో భాగంగా  మంగళవారం తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ వైసీపీ విప్ జారీ చేసింది.  29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని ఆదేశించింది. సభకు వచ్చి ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నేరుగా వెళ్లి విప్ అందజేయాలని […]

Advertisement
Update:2016-03-22 07:36 IST

తమ పార్టీ గుర్తుపై గెలిచి టీడీపీలో చేరిపోయిన 8మంది ఎమ్మెల్యేలను వైసీపీ వదిలిపెట్టేలా లేదు. వారిపై అనర్హత వేటు వేయించేందుకు మరో ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా మంగళవారం తన పార్టీ ఎమ్మెల్యేలందరికీ వైసీపీ విప్ జారీ చేసింది. 29, 30 తేదీల్లో తప్పనిసరిగా అసెంబ్లీకి హాజరు కావాలని ఆదేశించింది. సభకు వచ్చి ద్రవ్యవినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని విప్ జారీ చేసింది. పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు నేరుగా వెళ్లి విప్ అందజేయాలని వైసీపీ నిర్ణయించింది.

ఒకవేళ విప్‌ తీసుకోకుండా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తే వారి క్యార్టర్స్‌ లో విప్ అందజేయాలని నిర్ణయించింది. వారికి విప్‌ అందజేసినట్టు చూపేందుకు సాక్ష్యాలు కూడా ఉండేలా వైసీపీ జాగ్రత్తపడుతోంది. విప్‌ జారీ అయిన తర్వాత సభ్యులు తప్పనిసరిగా సభకు రావాల్సి ఉంటుంది. పార్టీ ఆదేశం మేరకు ఓటు వేయాల్సి ఉంటుంది. సభకు రాకపోయినా, పార్టీ నిర్ణయానికి అనుగుణంగా ఓటు వేయకపోయినా అటోమెటిక్‌గా సభ్యులపై అనర్హత వేటు పడుతుంది.

ఇప్పటికే ఎనిమిది మంది రెండుసార్లు సభలో అనర్హత గండం నుంచి అధికార పార్టీ సాయంతో తప్పించుకున్నారు . ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టిన సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బుక్‌ అయిపోయారని అందరూ అనుకున్నారు. అయితే వైసీపీకి విప్ జారీ చేసే సమయం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా అవిశ్వాసంపై చర్చకు నిర్ణయం తీసుకుని ఆఘమేఘాల మీద తంతుపూర్తి చేశారు.

స్పీకర్‌పై అవిశ్వాసం సమయంలో ఇదే ఎత్తును అధికార పార్టీ ప్రయోగించింది. తెలివిగా ఆ సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఉండేలా అధికార పార్టీ జాగ్రత్తపడింది. వైసీపీ విప్ జారీ చేసినా .. దాన్ని అందుకుని సభకు వచ్చేంత సమయం తమకు లేకుండాపోయిందని ఎనిమిది మంది సభ్యులు వాదించుకునేందుకు అస్కారం కల్పించారు. ఇలా రెండుసార్లు మోసపోయిన వైసీపీ ఇప్పుడు ద్రవ్యవినిమయ బిల్లుపై ఓటింగ్ సమయంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేల పనిపట్టేందుకు నిర్ణయించింది. అయితే నిబంధనలు తొలగించడంలోనూ… అప్పటికప్పుడు అనుకున్నది చేసేయడంలోనూ దూకుడుగా వెళ్తున్న అధికార పార్టీ ఈసారి ఎనిమిది మంది సభ్యులను కాపాడేందుకు ఏ ఎత్తు వేస్తుందో చూడాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News