అప్పుల్లో బాబును సీఎం చేసిన హోటల్

వైశ్రాయ్‌ హోటల్. ఈ పేరు వినని వారు తెలియని వారు చాలా అరుదు. ఎందుకంటే ఏపీ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన కార్యక్రమానికి ఈ హోటల్ వేదికైంది అప్పట్లో. ఎన్టీఆర్‌ను గద్దె దించే సమయంలో చంద్రబాబు తన వర్గం ఎమ్మెల్యేలందరినీ ఈ వైశ్రాయ్‌ హోటల్‌లో ఉంచారు. ఎమ్మెల్యేలను తీసుకెళ్లేందుకు వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పుల దాడి జరిగింది కూడా ఈ హోటల్‌ వద్దే. ఇక్కడి నుంచి బాబు తన కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపారు.  అందుకు ప్రతిఫలంగా ఈ […]

Advertisement
Update:2016-03-22 10:41 IST

వైశ్రాయ్‌ హోటల్. ఈ పేరు వినని వారు తెలియని వారు చాలా అరుదు. ఎందుకంటే ఏపీ రాష్ట్ర రాజకీయాలను కీలక మలుపు తిప్పిన కార్యక్రమానికి ఈ హోటల్ వేదికైంది అప్పట్లో. ఎన్టీఆర్‌ను గద్దె దించే సమయంలో చంద్రబాబు తన వర్గం ఎమ్మెల్యేలందరినీ ఈ వైశ్రాయ్‌ హోటల్‌లో ఉంచారు. ఎమ్మెల్యేలను తీసుకెళ్లేందుకు వచ్చిన ఎన్టీఆర్‌పై చెప్పుల దాడి జరిగింది కూడా ఈ హోటల్‌ వద్దే. ఇక్కడి నుంచి బాబు తన కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపారు. అందుకు ప్రతిఫలంగా ఈ హోటల్ ఎండీ ప్రభాకర్ రెడ్డిని చంద్రబాబు రాజ్యసభకు పంపారు.

ఇప్పుడు ఈ హోటల్‌ యజమాని ప్రభాకర్ రెడ్డి అప్పుల్లో ఉన్నారు. ప్రభాకర్ రెడ్డికి అప్పులిచ్చిన బ్యాంకులు ధర్నాలకు దిగాయి. వైశ్రాయి ప్రభాకర్ రెడ్డికి అప్పు ఇచ్చిన ఓరియంటల్ బ్యాంకు రుణం రికవరీ కోసం ఉద్యోగులను రంగంలోకి దింపింది. బ్యాంకు ఉద్యోగులు జూబ్లిహిల్స్‌ లోని ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు ధర్నాకు దిగారు. రుణం తిరిగి చెల్లించండంటూ బ్యానర్లు ప్రదర్శించారు. ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా అప్పు చెల్లించడం లేదని అందుకే తాము ధర్నాకు దిగాల్సి వచ్చిందని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారు.

ఈ మధ్య పెద్దోళ్ల నుంచి అప్పులు రాబట్టుకునేందుకు బ్యాంకులు తమ సిబ్బందితో ధర్నాలు చేయిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం బీజేపీ నేత కావూరి సాంబశివరావు ఇంటి ముందు కూడా వివిధ బ్యాంకుల సిబ్బంది ఈ తరహాలోనే ధర్నాలు చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News