మంది సొమ్మే కదా! కానివ్వండి బాస్...
పేదల సంక్షేమం, రైతులకు మద్దతు ధర సంగతేమో గానీ ప్రజాప్రతినిధులు మాత్రం తమకు మద్దతు దక్కేలా చేసుకోవడంలో మాత్రం పోటీపడుతున్నారు. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అనే పార్టీలు కూడా ఈ విషయంలో మాత్రం ఒక్కటైపోయాయి. తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతకాలం రాజకీయాన్ని సేవ అనుకున్నాం. కానీ ఇకపై ప్రజాప్రతినిధులను కూడా ఉద్యోగులు అంటే బాగుంటుందేమో!. జీతాల పెంపుపై ఎమినిటీస్ కమిటీ గంటపాటు సమావేశమైంది. భేటీకి అన్ని పార్టీల […]
పేదల సంక్షేమం, రైతులకు మద్దతు ధర సంగతేమో గానీ ప్రజాప్రతినిధులు మాత్రం తమకు మద్దతు దక్కేలా చేసుకోవడంలో మాత్రం పోటీపడుతున్నారు. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అనే పార్టీలు కూడా ఈ విషయంలో మాత్రం ఒక్కటైపోయాయి. తెలంగాణలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు భారీగా జీతాలు పెంచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇంతకాలం రాజకీయాన్ని సేవ అనుకున్నాం. కానీ ఇకపై ప్రజాప్రతినిధులను కూడా ఉద్యోగులు అంటే బాగుంటుందేమో!.
జీతాల పెంపుపై ఎమినిటీస్ కమిటీ గంటపాటు సమావేశమైంది. భేటీకి అన్ని పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ముఖ్యంగా తమ జీతాల పెంపుపైనే చర్చించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాలు రూ.95 వేలు ఉండగా.. దాన్ని ఏకంగా మూడున్నర లక్షలకు పెంచుకునేందుకు నేతలంతా కలిసి రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం దేశంలో ఎమ్మెల్యేలకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్న రాష్ట్రంగా ఢిల్లీ ఉంది. రెండు లక్షల పది వేలు చెల్లిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ నేతలు అనుకున్నట్టుగా జీతాలు పెంచుకుంటే దేశంలోనే ఎమ్మెల్యేలకు అత్యధిక జీతాలు చెల్లించే రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుంది.
జీతాల పెంపుకు అన్ని పార్టీలు సుముఖత వ్యక్తం చేసిన నేపథ్యంలో నేతల జీతాల పంట పండడం ఖాయంగానే కనిపిస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ పించన్ మొత్తాన్ని కూడా పెంచనున్నారు. ఈనెలాఖరులో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. అయితే ఒక్కసారి 95 వేల నుంచి ఏకంగా మూడున్నర లక్షలకు జీతాలు పెంచేందుకు సిద్ధమవడంపై విమర్శలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజాప్రతినిధులంతా పేదవాళ్లు అంటే అదీ కాదు. ఢిల్లీ ప్రభుత్వంలాగా ఎమ్మెల్యేలను అవినీతికి దూరంగా వుంచే శక్తి మన ప్రభుత్వానికి ఉందా అంటే అదీ లేదు. ఏ కొందరు మినహా మిగిలిన వారంతా కోటీశ్వరులే. అయినా జనం సొమ్ముతో జీతాలు పెంచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాగే ఆకాశంలో విహరిస్తూ పోతే రిచ్ స్టేట్ కాస్త అప్పుల స్టేట్ అవుతుంది.
Click on Image to Read: