సోషల్‌ మీడియాలో అనిత అని కొడితే…

ప్రివిలేజ్ కమిటీ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విపక్షం లేకుండా అధికార పక్షం చర్చను నిర్వహించింది. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిత .. రోజా తీరును తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ నుంచి తనకు చేదు అనుభవం ఎదురైందన్నారు అనిత.  వారు ఏ జాతివారిగా పరిగణించాలో కూడా అర్థం కావడం లేదు. సభలోకి రావాలంటే మహిళలు భయపడే పరిస్థితి ఉందన్నారు.  తాను బతికున్నంత కాలం ఈ అవమానాన్ని మరచిపోలేనన్నారామె. టీడీపీ సభ్యులు ఇచ్చిన మద్దతును మరవలేనన్నారు. స్పీకర్‌తో […]

Advertisement
Update:2016-03-21 11:54 IST

ప్రివిలేజ్ కమిటీ సమర్పించిన నివేదికపై అసెంబ్లీలో చర్చ జరిగింది. విపక్షం లేకుండా అధికార పక్షం చర్చను నిర్వహించింది. చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిత .. రోజా తీరును తీవ్రంగా తప్పుపట్టారు. వైసీపీ నుంచి తనకు చేదు అనుభవం ఎదురైందన్నారు అనిత. వారు ఏ జాతివారిగా పరిగణించాలో కూడా అర్థం కావడం లేదు. సభలోకి రావాలంటే మహిళలు భయపడే పరిస్థితి ఉందన్నారు. తాను బతికున్నంత కాలం ఈ అవమానాన్ని మరచిపోలేనన్నారామె.

టీడీపీ సభ్యులు ఇచ్చిన మద్దతును మరవలేనన్నారు. స్పీకర్‌తో పాటు మిగిలిన సభ్యులంతా అండగా మేం ఉన్నాము అనితా అంటూ మనోధైర్యం నింపారన్నారు. అలా చేయడం ద్వారా తనను మానసిక క్షోభ నుంచి విడుదల చేశారన్నారు. రోజాను ఎట్టి పరిస్థితిలోనూ క్షమించకూడదని కోరారు. సోషల్‌ మీడియాలో అనితా అని పేరు కొడితే… రోజా తనను తిట్టిన మాటలే వస్తున్నాయని అనిత ఆవేదన చెందారు.

రోజా ఏనాడు తన నియోజకవర్గం గురించి సభలో మాట్లాడలేదని అనిత విమర్శించారు. రోజాకు ఎంత కఠిన శిక్ష విధించినా తాను ఎదుర్కొన్న బాధకు, మానసిక క్షోభకు సరిపోదన్నారు. రోజా తరహాలో ఎవరైనా టీడీపీలో వ్యవహరించి ఉంటే చంద్రబాబు అప్పటికప్పుడు డిస్మిస్ చేసే వారని అనిత చెప్పారు. తనపై రోజా చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా ఉన్నాయన్నారు. మహిళల విషయంలో వైసీపీ వైఖరి ఏంటో చెప్పాలన్నారు.

మరోవైపు రోజాపై అసెంబ్లీ చర్చ జరిగిన తీరును వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తప్పుపట్టారు. ఒక చట్ట సభను ఒక మహిళపై చర్చ జరిపేందుకు వాడుకోవడం సిగ్గుచేటన్నారు. రోజాపై చంద్రబాబుకు ఎందుకంత కోపం అని ప్రశ్నించారు. కాల్‌ మనీ సెక్స్ రాకెట్‌పై నిలదీయడమే రోజా చేసిన పాపమా అని నిలదీశారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌లో ఎంతో మంది పేద మహిళలు నలిగిపోయారన్నారు. చంద్రబాబుకు రోజా అంటే భయం పట్టుకుందన్నారు. గిరిజనలు అజ్ఞానులు అని మంత్రి రావెల కిషోర్ బాబు అనలేదా అని ప్రశ్నించారు.

రోజా టీడీపీలో ఉన్నప్పుడు కూడా మహిళలపక్షాన పోరాడిందన్నారు. టీడీపీ నేతలు సభలో అసభ్యపదజాలం వాడలేదా అని అన్నారు. సభ మొత్తం ఏకపక్షంగా నడుపుతున్నారని… ఇలాంటి చట్టసభలోకి ఎందుకు వచ్చామా అని సిగ్గుపడుతున్నాం అన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలతో గిరిజన మహిళలుగా తాము కూడా తలదించుకుని ఉండిపోయిన రోజులున్నాయన్నారు. వాటిపై తాము ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశామని కానీ చర్యలు మాత్రం లేవన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News