నారాయణ… నారాయణ… మాస్ కాపియింగ్‌కు మాస్టర్ ప్లాన్?

నారాయణ స్కూల్స్ యాజమాన్యం మాయజాలం మరోసారి బట్టబయలైంది.  పదో తరగతి పరీక్షల్లో అమలవుతున్న జంబ్లింగ్‌ విధానానికే నారాయణ యాజమాన్యం తూట్లు పొడిచిందన్న ఆరోపణలు  వస్తున్నాయి. అధికార బలం ఉపయోగించి జంబ్లింగ్ విధానానికి విరుద్దంగా తమ స్కూల్‌ విద్యార్థులందరినీ ఒకే సెంటర్‌లో వేయించుకుందని మీడియాలో కథనాలు వచ్చాయి. కర్నూలులో నారాయణ స్కూల్ విద్యార్థులంతా ఒకే సెంటర్‌లో పడడం ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు. కర్నూలులో బళ్లారి చౌరస్తాలోని నారాయణ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 161 మంది విద్యార్థులు పదో […]

Advertisement
Update:2016-03-21 04:57 IST

నారాయణ స్కూల్స్ యాజమాన్యం మాయజాలం మరోసారి బట్టబయలైంది. పదో తరగతి పరీక్షల్లో అమలవుతున్న జంబ్లింగ్‌ విధానానికే నారాయణ యాజమాన్యం తూట్లు పొడిచిందన్న ఆరోపణలు వస్తున్నాయి. అధికార బలం ఉపయోగించి జంబ్లింగ్ విధానానికి విరుద్దంగా తమ స్కూల్‌ విద్యార్థులందరినీ ఒకే సెంటర్‌లో వేయించుకుందని మీడియాలో కథనాలు వచ్చాయి. కర్నూలులో నారాయణ స్కూల్ విద్యార్థులంతా ఒకే సెంటర్‌లో పడడం ఇందుకు నిదర్శనంగా చూపుతున్నారు.

కర్నూలులో బళ్లారి చౌరస్తాలోని నారాయణ రెసిడెన్షియల్ ఇంగ్లిష్ మీడియం స్కూల్‌లో 161 మంది విద్యార్థులు పదో తరగతి చదువుతున్నారు. జంబ్లింగ్ విధానాన్ని బట్టి వీరిని వేర్వేరు సెంటర్లకు కేటాయించాలి. కానీ 161 మంది విద్యార్థుల్లో ఏకంగా 140 మంది విద్యార్థులను ఒకే సెంటర్‌లో వేశారు. సెయింట్ క్లారెట్ స్కూల్‌కు కేటాయించారు. ఈ పరిణామం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. నిబందనల ప్రకారం ఒక సెంటర్‌కు దాదాపు 10 నుంచి 15 స్కూళ్ల విద్యార్థులను జంబ్లింగ్ చేయాలి. కానీ సెయింట్ క్లారెట్ స్కూల్‌లో అది జరగలేదు. 220 మంది విద్యార్థులను కేటాయించగా అందులో 140 మంది నారాయణ స్కూల్ విద్యార్థులే. మిగిలిన 60 మంది మరో నాలుగు స్కూళ్లకు చెందిన వారు. మాస్ కాపియింగ్ చేయించడం ద్వారా ర్యాంకులు సాధించడం కోసమే నారాయణ యాజమాన్యం అధికారులను లొంగదీసుకుని ఇలా చేసిందని చెబుతున్నారు.

జంబ్లింగ్ విధానంలో విద్యార్థులను కేటాయించే ప్రక్రియ హైదరాబాద్‌లోని డైరక్టరేట్ లో జరుగుతుంది. అక్కడే నారాయణ కాలేజ్ యాజమాన్యం చక్రం తిప్పిఉంటుందని ఆరోపణలు వస్తున్నాయి. డీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాత్రం నారాయణ పాఠశాలకు చెందిన 140 మంది విద్యార్థులు ఒకే కేంద్రానికి ఎలా కేటాయించారో తనకు తెలియదన్నారు. ఆ కేటాయింపు తమ పరిధిలో జరగదని చెబుతున్నారు. అయితే ఒక్క కర్నూలులోనే ఇలా జరిగిందా లేక రాష్ట్రం మొత్తం మీద ఇదే తంతును నడిపారా అన్న దానిపై విచారణ జరపాలని ఇతర పాఠశాలల యాజమాన్యాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇలా విద్యార్థులందరికి ఒకే సెంటర్ కేటాయించడం అన్నది ఉద్దేశపూర్వకంగా జరిగిందా లేక పొరపాటుగా జరిగిందా అన్నది తేలాలి.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News