న్యాయం వర్సెస్‌ శాసనం- అప్పట్లో రామోజీని మాత్రం సభకు రప్పించలేదు

రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు రద్దు చేయడం ఆ తీర్పును పాటించేందుకు ఏపీ అసెంబ్లీ ససేమిరా అంటుండడంతో పరిస్థితి న్యాయస్థానాలు వర్సెస్   చట్టసభలు అన్నట్టుగా తయారైంది.  ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఎప్పుడైనా ఎదురయ్యాయా అంటే తెలుగు రాష్ట్రంలో రెండు కీలక సంఘటనలు అప్పట్లో జరిగాయి. ఒకటి రామోజీరావు విషయంలోనూ, మరొకటి మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ కుమారుడి విషయంలో జరిగాయి. ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన  తొలినాళ్లలో శాసనమండలిలో సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ అంశంపై అప్పట్లో ఈనాడు […]

Advertisement
Update:2016-03-20 08:48 IST

రోజా సస్పెన్షన్‌ను హైకోర్టు రద్దు చేయడం ఆ తీర్పును పాటించేందుకు ఏపీ అసెంబ్లీ ససేమిరా అంటుండడంతో పరిస్థితి న్యాయస్థానాలు వర్సెస్ చట్టసభలు అన్నట్టుగా తయారైంది. ఇలాంటి పరిస్థితులు గతంలోనూ ఎప్పుడైనా ఎదురయ్యాయా అంటే తెలుగు రాష్ట్రంలో రెండు కీలక సంఘటనలు అప్పట్లో జరిగాయి. ఒకటి రామోజీరావు విషయంలోనూ, మరొకటి మాజీ కేంద్ర మంత్రి శివశంకర్ కుమారుడి విషయంలో జరిగాయి.

ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో శాసనమండలిలో సభ్యుల మధ్య గొడవ జరిగింది. ఈ అంశంపై అప్పట్లో ఈనాడు పత్రిక పెద్దల సభలో సభ్యుల తీరును తప్పుపడుతూ కథనం రాసింది. దీనిపై మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటికి ఇంకా మండలిలో కాంగ్రెస్‌దే మెజారిటీ ఉండేది. దీంతో రామోజీరావు క్షమాపణ చెప్పాలంటూ సభాహక్కుల ఉల్లంఘన శాసనమండలి ఆదేశాలు జారీ చేసింది. కానీ రామోజీ సుప్రీంకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. శాసనమండలి ఆదేశాలపై జోక్యం చేసుకునే హక్కు కోర్టులకు లేదంటూ మరోసారి శాసనమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. రామోజీరావును అరెస్ట్ చేసి సభకు తీసుకురావాలని నగర సీపీని మండలి ఆదేశించింది. కానీ ఆ సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడంతో శాసనమండలి ఆదేశాలను సీపీ అమలు చేయలేకపోయారు. అలా శాసనమండలి నిర్ణయం అమలు కాకుండా టీడీపీ ప్రభుత్వం సాయంతో రామోజీ తప్పించుకున్నారని చెబుతుంటారు.

మరోసారి కూడా ఇలాంటి ఉదంతమే జరిగింది. ఒకసారి కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ కుమారుడు, యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న సుధీర్‌… ప్రభుత్వ విధానాలకు నిరసనగా అసెంబ్లీ వద్ద ఆందోళన చేశారు. సభలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో అప్పటి స్పీకర్‌ నారాయణరావు ఏకంగా సుధీర్‌కు నెలపాటు జైలు శిక్ష విధించారు. అప్పుడు అధికారంలో ఉన్న ఎన్టీఆర్‌ ప్రభుత్వం వెంటనే అసెంబ్లీ స్పీకర్ ఆదేశాలను అమలు చేసింది. సుధీర్‌ను జైల్లో పెట్టింది. దీనిపైనా సుప్రీం అభ్యంతరం వ్యక్తంచేసింది. జైలు శిక్షలు వేసే అధికారం స్పీకర్‌కు ఎక్కడిదని ప్రశ్నించింది.

వెంటనే సుధీర్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. అయితే అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసి సుధీర్‌ నెల రోజుల శిక్ష అనుభవించిన తర్వాతే బయటకు వచ్చేలా చేసింది. రాష్ట్రంలో శాసనసభకు, కోర్టులకు మధ్య వివాదాలు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తలెత్తడం విశేషం. అప్పట్లో తమకు ఇష్టుడైన రామోజీరావు అరెస్ట్‌ విషయంలో ఒకలా ప్రవర్తించిన టీడీపీ… కాంగ్రెస్‌ యూత్ లీడర్ సుధీర్‌, ఇప్పుడు రోజా విషయంలో మాత్రం ఆఘమేఘాల మీద చర్యలకు దిగడం గమనార్హం.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News