అసెంబ్లీకి 'రోజా' ముల్లు, వైసీపీ దెబ్బకు వెనక్కు వెళ్లిపోయిన విష్ణుకుమార్‌

రోజా అంశం అసెంబ్లీని షేక్‌ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా రోజాను సభలోకి అనుమతించకపోవడంపై సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోడియం వద్ద నిరసనకు దిగారు. మాకు న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లదుస్తులతో జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నా స్పీకర్‌ పట్టించుకోలేదు. ప్రశ్నోత్తరాలను నిర్వహించారు.  అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు.  మధ్యలో లేచిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు […]

Advertisement
Update:2016-03-19 04:09 IST

రోజా అంశం అసెంబ్లీని షేక్‌ చేసింది. హైకోర్టు తీర్పు తర్వాత కూడా రోజాను సభలోకి అనుమతించకపోవడంపై సభలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. పోడియం వద్ద నిరసనకు దిగారు. మాకు న్యాయం కావాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నల్లదుస్తులతో జగన్‌తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వచ్చారు. వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నా స్పీకర్‌ పట్టించుకోలేదు. ప్రశ్నోత్తరాలను నిర్వహించారు. అధికార పార్టీ సభ్యులు మాట్లాడారు. మధ్యలో లేచిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఆకాశానికెత్తారు.

రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నిరంతరం కృషి చేస్తుంటే ప్రతిపక్షం అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ సభ్యులకు ఇంకితజ్ఞానం, సభ్యత లేదని అనుచిత వ్యాఖ్యలు చేశారు. వైసీపీ సభ్యులపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని హెచ్చరించారు. విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతున్న సమయంలో వైసీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. వైసీపీ స్లోగన్స్‌ దెబ్బకు విష్ణుకుమార్ తాను వెనుక బెంచ్‌కు వెళ్లి మాట్లాడుతానని అనుమతి ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు.

స్పీకర్‌ అనుమతితో వెనుక బెంచ్‌ల వద్దకు వెళ్లి విష్ణుకుమార్‌ రాజు వైసీపీపై విమర్శలు చేశారు. ఇంతకంటే సిగ్గుమాలిన ప్రతిపక్షం మరొకటి ఉండదన్నారు. ప్రభుత్వానికి అండగా నిలవడంలో టీడీపీ సభ్యుల కంటే బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌ అయిన విష్ణుకుమార్‌ రాజు చాలా దూకుడుగా వ్యవహరించారు.అనంతరం మైక్ అందుకున్న సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రపదజాలంతో వైసీపీని విమర్శించారు. నీచ నికృష్టమైన ప్రతిపక్షం అంటూ … జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించబోయారు. ఇంతలోనే స్పీకర్‌ సభను 10 నిమిషాలు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమయ్యాక కూడా వైసీపీ సభ్యుల ఆందోళన కొనసాగడంతో సభను రెండోసారి వాయిదా వేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News