రోజాను ఉరి తీస్తారా? చిత్తకార్తె కుక్క తండ్రి సభలో ఉండవచ్చా?

కోర్టుల కంటే శాసనసభే గొప్పదని టీడీపీ నేతలు వాదించడంపై రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనను ఉరి తీయాలని తీర్మానం చేస్తే తీసేస్తారా అని రోజా ప్రశ్నించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని నిలదీశారు. ఎక్కడైనా తప్పులు జరిగితే కోర్టులు సవరిస్తాయని, కానీ నేడు  న్యాయవ్యవస్థను అసెంబ్లీయే  ధిక్కరిస్తుంటే ఇంకేం చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్ డే అన్నారు. చీఫ్ మార్షల్ గణేశ్ బాబు టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో తాను […]

Advertisement
Update:2016-03-18 07:38 IST

కోర్టుల కంటే శాసనసభే గొప్పదని టీడీపీ నేతలు వాదించడంపై రోజా అభ్యంతరం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తనను ఉరి తీయాలని తీర్మానం చేస్తే తీసేస్తారా అని రోజా ప్రశ్నించారు. అప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోకూడదా అని నిలదీశారు. ఎక్కడైనా తప్పులు జరిగితే కోర్టులు సవరిస్తాయని, కానీ నేడు న్యాయవ్యవస్థను అసెంబ్లీయే ధిక్కరిస్తుంటే ఇంకేం చేయాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఇది బ్లాక్ డే అన్నారు.

చీఫ్ మార్షల్ గణేశ్ బాబు టీడీపీ కార్యకర్తలా ప్రవర్తిస్తున్నారని రోజా ఆరోపించారు. గతంలో తాను సస్పెన్షన్ ఆర్డర్ తీసుకుందామని వచ్చిన సమయంలోనూ బయటకు లాగేశారని, తన మీద మార్షల్స్ కూర్చోవడంతో రెండు గంటల పాటు స్పృహకోల్పోయానన్నారు.. చివరకు ఆస్పత్రిలో కూడా ఇన్ పేషెంటుగా చేర్చుకోవద్దని చెప్పారన్నారు. కోర్టుల కంటే అసెంబ్లీయే గొప్పదంటున్న టీడీపీ నేతలు మరి కోర్టులో అప్పిల్ ఎందుకు చేశారని… వాదనలు ఎందుకు వినిపించారని రోజా ప్రశ్నించారు.

చిత్తకార్తె కుక్కలాగా ఒక మహిళను కారులోకి లాగిన రావెల సుశీల్ తండ్రి రావెల కిషోర్ అసెంబ్లీలో కూర్చోవడానికి అర్హుడా అని ప్రశ్నించారు రోజా. మహిళా తహసీల్దార్‌ను కొట్టిన రౌడీషీటర్ చింతమనేని సభలో ఉండవచ్చా అని రోజా ప్రశ్నించారు. కాల్‌ మనీ సెక్స్ రాకెట్ నిందితులు శాసనమండలిలో ఉంటే తప్పు కాదా అన్నారు. చివరకు ఎమ్మెల్యే అయ్యానన్న గర్వంతో టీచర్‌ని చెప్పు తీసుకుని కొట్టిన అనిత కూడా సభలో ఉండవచ్చా అని నిలదీశారు. పార్టీ ఫిరాయించినవాళ్లను సస్పెండ్ చేసి బయటకు పంపాల్సింది పోయి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

తాను ఇప్పటివరకు చేయని తప్పుకు శిక్ష అనుభవించానని, తన నోరు నొక్కేయడానికి ప్రయత్నించారని రోజా చెప్పారు. ఈ రెండేళ్ల కాలంలో బోండా ఉమా, అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, సాక్షాత్తు చంద్రబాబు అనేక అన్ పార్లమెంటరీ పదాలు మాట్లాడారని.. కానీ తాను అలా ఏమీ మాట్లాడకపోయినా వాళ్ల ఇష్టానికి మాటలు రాసేసుకుని శిక్షలు వేసేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. గర్బిణీగా ఉన్న సమయంలోనూ మండుటెండలో రోడ్డుపైకి వచ్చి ప్రజాసమస్యలపై పోరాడిన చరిత్ర తనదన్నారు రోజా. ప్రభుత్వం ఎన్నిఅడ్డంకులు సృష్టించినా ప్రజాసమస్యలపై పోరాటం మాత్రం ఆగబోదన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News