అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత- రోజాకు నో ఎంట్రీ, జగన్ వాగ్వాదం

రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ అసెంబ్లీలోకి మాత్రం ఆమెను అనుమతివ్వడం లేదు. స్పీకర్ ఆదేశాలతో రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి మాత్రమే అనుమతించారు. అసెంబ్లీ మందిరంలోకి మాత్రం అనుమతించబోమని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీ గేట్ 2 దాటిన తర్వాత రోజాను అడ్డుకున్నారు. స్పీకర్ ఆదేశాలతోనే తాము రోజాను అడ్డుకున్నామని మార్షల్స్ చెబుతున్నారు. ఈ సమయంలోనే జగన్‌ కూడా అక్కడికి వచ్చారు. రోజాను అడ్డుకోవడంపై మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. రోజా అసెంబ్లీకి […]

Advertisement
Update:2016-03-18 03:42 IST

రోజాపై ఏడాది సస్పెన్షన్‌ను హైకోర్టు కొట్టివేసినప్పటికీ అసెంబ్లీలోకి మాత్రం ఆమెను అనుమతివ్వడం లేదు. స్పీకర్ ఆదేశాలతో రోజాను అసెంబ్లీలోకి అడుగుపెట్టకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోకి మాత్రమే అనుమతించారు. అసెంబ్లీ మందిరంలోకి మాత్రం అనుమతించబోమని చీఫ్ మార్షల్ అడ్డుకున్నారు. అసెంబ్లీ గేట్ 2 దాటిన తర్వాత రోజాను అడ్డుకున్నారు.

స్పీకర్ ఆదేశాలతోనే తాము రోజాను అడ్డుకున్నామని మార్షల్స్ చెబుతున్నారు. ఈ సమయంలోనే జగన్‌ కూడా అక్కడికి వచ్చారు. రోజాను అడ్డుకోవడంపై మార్షల్స్‌తో వాగ్వాదానికి దిగారు. రోజా అసెంబ్లీకి హాజరయ్యేలా తమ వద్ద కోర్టు ఆదేశాలున్నాయని… మరి అడ్డుకునేందుకు మీ వద్ద ఏం అధికారం ఉందో చెప్పాలని జగన్‌ నిలదీశారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించే హక్కు ఎవరిచ్చారని ప్రశ్నించారు. మిగిలిన వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రోజాతో పాటు సభ బయటే ఉన్నారు. అయితే తామేమీ చేయలేమని స్పీకర్ ఆదేశాలను మాత్రమే పాటిస్తున్నామని అసెంబ్లీ సిబ్బంది చెప్పారు.

తనపై సస్పెన్షన్ ను కోర్టు రద్దు చేసిన తీర్పు కాపీని నిన్ననే అసెంబ్లీ కార్యదర్శిని కలిసి రోజా అందజేశారు. నిన్ననే ఆమె అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలనుకున్నారు. కానీ అప్పటికే అసెంబ్లీ వాయిదా పడింది. దీంతో ఉదయం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి వచ్చారు.

Click on Image to Read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News