హైకోర్టును లెక్కచేయని స్పీకర్‌… కనీసం ఇలా చేసి ఉండాల్సింది

జిల్లా కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వాలు తప్పకుండా పాటించడం ఇప్పటివరకు చూశాం. అలాంటిది హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం లెక్కచేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈపరిణామంపై చాలా మంది ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  ఇలా న్యాయవ్యవస్థతో శాసన వ్యవస్థ  నేరుగా ఢీకొట్టడం చాలా అత్యంత అరుదైనదిగా చెబుతున్నారు. రోజా అసెంబ్లీలోకి అడుగుపెడితే తమ అహం దెబ్బతింటుందన్న పట్టింపుతోనే ప్రభుత్వం  నిప్పుతో చెలగాటం ఆడుతోందని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదన్న […]

Advertisement
Update:2016-03-18 04:27 IST

జిల్లా కోర్టు తీర్పులను కూడా ప్రభుత్వాలు తప్పకుండా పాటించడం ఇప్పటివరకు చూశాం. అలాంటిది హైకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం లెక్కచేయకపోవడం చర్చనీయాంశమైంది. ఈపరిణామంపై చాలా మంది ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలా న్యాయవ్యవస్థతో శాసన వ్యవస్థ నేరుగా ఢీకొట్టడం చాలా అత్యంత అరుదైనదిగా చెబుతున్నారు.

రోజా అసెంబ్లీలోకి అడుగుపెడితే తమ అహం దెబ్బతింటుందన్న పట్టింపుతోనే ప్రభుత్వం నిప్పుతో చెలగాటం ఆడుతోందని అభిప్రాయపడుతున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలకు లేదన్న నిబంధన ఉన్న మాట వాస్తవమే. కానీ నిబంధనల పేరు చెప్పి సభలో తాము ఏమైనా చేస్తామనడం సొంత రాజ్యాంగాన్ని రచించుకోవడమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒక ఎమ్మెల్యేను సభలో హత్య చేసి … అసెంబ్లీలో జరిగిన హత్యపై కోర్టులు జోక్యం చేసుకోకూడదంటే ఆ వాదన నిలబడుతుందా అని ప్రశ్నిస్తున్నారు.

ఒక వ్యక్తి స్వేచ్చకు, హక్కులకు భంగం కలిగించడం కూడా ఆ తరహా నేరమేనంటున్నారు. కాబట్టి ఈ సమయంలో కోర్టులు జోక్యం చేసుకోకపోతే ఇక సభ్యుల హక్కులు అధికార పార్టీ చేతిలో బంధీ అయిపోతాయని ఆందోళన చెందుతున్నారు. హైకోర్టుపై స్పీకర్‌కు ఏమాత్రం గౌరవం ఉన్నా … కనీసం ప్రస్తుతానికి రోజాను సభలోకి అనుమతించాల్సింది అని అభిప్రాయపడుతున్నారు. అనంతరం కోర్టులో అప్పీల్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే అప్పుడు తిరిగి రోజాను సభ నుంచి బయటకు పంపాల్సింది అంటున్నారు. అలా కాకుండా ఏకంగా కోర్టు తీర్పునే నేరుగా ధిక్కరించేందుకు సాహసించడం మంచి పరిణామం కాదంటున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News