ముందు చూపుతోనే జగన్‌ పేరును రోజా ప్రస్తావించలేదా?

తనపై అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసిన సమయంలో రోజా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆమె న్యాయస్థానానికి కృతజ్ఞతలు చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కానీ ఎక్కడా కూడా జగన్‌ పేరు గానీ, వైసీపీ పేరుగానీ ప్రస్తావించలేదు.  సహజంగా అయితే  తనకు అండగా నిలిచిన పార్టీకి కృతజ్ఞతలు అని చెబుతారు. కానీ రోజా ఆ పని చేయలేదు. అయితే  రోజా ఇలా వ్యవహరించడానికి కారణం […]

Advertisement
Update:2016-03-18 05:11 IST

తనపై అసెంబ్లీ విధించిన ఏడాది సస్పెన్షన్‌ను హైకోర్టు ఎత్తివేసిన సమయంలో రోజా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడిన ఆమె న్యాయస్థానానికి కృతజ్ఞతలు చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. కానీ ఎక్కడా కూడా జగన్‌ పేరు గానీ, వైసీపీ పేరుగానీ ప్రస్తావించలేదు. సహజంగా అయితే తనకు అండగా నిలిచిన పార్టీకి కృతజ్ఞతలు అని చెబుతారు. కానీ రోజా ఆ పని చేయలేదు. అయితే రోజా ఇలా వ్యవహరించడానికి కారణం ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు.

కోర్టు తీర్పు వచ్చిన వెంటనే జగన్‌కు కృతజ్ఞతలు చెప్పి ఉంటే టీడీపీ వాళ్లు దాన్ని వాడుకునే వారు. ఏ పరిస్థితినైనా తమకు అనుకూలంగా మలుచుకుని మాట్లాడడంలో రాటుతేలిన టీడీపీ నేతలు తప్పని సరిగా అసెంబ్లీలో ఎదురుదాడి చేసేవారు. అసెంబ్లీ పరువును కోర్టులకు లాగిన ఘనత జగన్‌కే దక్కుతుందని ఆరోపణలు చేసేవారు. రోజాను వెనుకుండి సుప్రీం వరకు తీసుకెళ్లారని విమర్శించేవారు. అయితే రోజా జగన్‌ పేరు ప్రస్తావించకపోవడం ద్వారా ఆమె వ్యక్తిగతంగానే తనకు జరిగిన అన్యాయంపై న్యాయపోరాటం చేశారన్న భావన ఏర్పడింది. జగన్‌ పేరును రోజా ప్రస్తావించి ఉంటే అసెంబ్లీని కోర్టుకు లాగింది జగనేనని టీడీపీ నేతలు చెప్పేవారు. ఇప్పుడా అవకాశం లేకుండా ఉండేందుకు రోజా …కోర్టు తీర్పు వచ్చిన సమయంలో జగన్ పేరును ప్రస్తావించలేదని చెబుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News