రోజాపై చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారా ? టీడీపీ ఎమ్మెల్యేలే చెప్పారా?
హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించడం ద్వారా చంద్రబాబు పాతాళానికి దిగజారిపోయారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఒక మహిళా ఎమ్మెల్యే అన్న భావన కూడా లేకుండా రోజాపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షలకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా రోజా సభలో కనిపించకూడదని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారని అంబటి చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే అసెంబ్లీ లాబీల్లో చెబుతున్నారని రాంబాబు వెల్లడించారు. రోజా అంటే […]
హైకోర్టు తీర్పును కూడా ధిక్కరించడం ద్వారా చంద్రబాబు పాతాళానికి దిగజారిపోయారని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఒక మహిళా ఎమ్మెల్యే అన్న భావన కూడా లేకుండా రోజాపై కక్ష సాధిస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిగత కక్షలకు అసెంబ్లీని వేదికగా చేసుకోవడం సిగ్గుచేటు అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉండగా రోజా సభలో కనిపించకూడదని చంద్రబాబు ప్రతిజ్ఞ చేశారని అంబటి చెప్పారు. ఈ విషయాన్ని స్వయంగా టీడీపీ ఎమ్మెల్యేలే అసెంబ్లీ లాబీల్లో చెబుతున్నారని రాంబాబు వెల్లడించారు.
రోజా అంటే చంద్రబాబుకు ఎందుకంత కసి అని ప్రశ్నించారు. టీడీపీని ఎదిరించి ఎమ్మెల్యే అయిందన్న ఆక్రోశం చంద్రబాబులో కనిపిస్తోందన్నారు. చంద్రబాబు జారీ చేసిన హుకుంను అనుసరించే స్పీకర్, యనమల కలిసి రోజాపై సస్పెన్షన్ వేటు వేశారని ఆరోపించారు. శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం కోర్టులకు లేదంటున్న టీడీపీ నేతలు… మరి ఇదే అంశంలో అప్పిల్‌కు ఎలా వెళ్లారని ప్రశ్నించారు. అసెంబ్లీ తరపు న్యాయవాది, ప్రభుత్వ తరపున న్యాయవాది వాదనలు విన్న తర్వాతే రోజా కేసులో హైకోర్టు తీర్పునిచ్చిందని అంబటి చెప్పారు.
కోర్టులకు జోక్యం చేసుకుని అధికారం లేదంటున్న ప్రభుత్వం కోర్టులో ఎందుకు వాదనలు వినిపించిందని ప్రశ్నించారు. చట్ట సభల్లో కోర్టులు జోక్యం చేసుకోకూడదన్న నిబంధన ఉన్నది నిజమేనని… అయితే చట్టాలను, రాజ్యాంగాన్ని అతిక్రమించేందుకు చట్టసభలు సిద్ధమైనప్పుడు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌ను జంప్ చేస్తే ఫైన్ వేయాలే గానీ… ఉరి శిక్ష వేస్తామంటే చట్టం ఒప్పుకుంటుందా అని అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు వికృత రూపం జనానికి ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోందన్నారు.
తనకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే చంద్రబాబు ఎంత దారుణంగా వ్యవహరిస్తారన్న దానికి ఇదే నిదర్శనం అన్నారు. మహిళా ఎమ్మెల్యే విషయంలో సిగ్గులేకుండా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు రాజకీయ శిరచ్చేదన తప్పదని అంబటి హెచ్చరించారు. గురువారం అసెంబ్లీ నాలుగు గంటల వరకు నిర్వహిస్తామంటూ లంచ్ కూడా ఏర్పాటు చేశారని.. కానీ రోజా అసెంబ్లీకి వస్తోందని తెలియగానే వాయిదా వేసుకుని పారిపోయారని అంబటి ఎద్దేవా చేశారు.
Click on Image to Read: