చంద్రబాబు, కోడెల, యనమల రాజీనామా చేస్తారా?

ఎమ్మెల్యే రోజాను రాజ్యాంగ విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్‌చేసిన స్పీకర్‌ కోడెల, సస్సెన్షన్‌ తీర్మానాన్ని మూవ్‌ చేసిన యనమల రామకృష్ణుడు, ప్రభుత్వాధినేత చంద్రబాబు రాజీనామా చేసే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించడం, రాష్ట్ర హైకోర్టు అసెంబ్లీ నిర్ణయాన్ని కొట్టివేసి రోజా సస్సెన్షన్‌ను రద్దుచేసిన నేపధ్యంలో రాజకీయాల్లో విలువలకోసం తపించే చంద్రబాబునాయుడు రాజీనామాచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో ఒక రైలు ప్రమాదం జరిగినందుకే ఆ శాఖమంత్రిగా బాధ్యత వహించి లాల్‌బహదూర్‌ శాస్త్రి గారు రాజీనామాచేశారు. […]

Advertisement
Update:2016-03-17 07:06 IST

ఎమ్మెల్యే రోజాను రాజ్యాంగ విరుద్ధంగా ఏడాదిపాటు సస్పెండ్‌చేసిన స్పీకర్‌ కోడెల, సస్సెన్షన్‌ తీర్మానాన్ని మూవ్‌ చేసిన యనమల రామకృష్ణుడు, ప్రభుత్వాధినేత చంద్రబాబు రాజీనామా చేసే అవకాశం ఉందా?

సుప్రీంకోర్టు తీవ్రంగా మందలించడం, రాష్ట్ర హైకోర్టు అసెంబ్లీ నిర్ణయాన్ని కొట్టివేసి రోజా సస్సెన్షన్‌ను రద్దుచేసిన నేపధ్యంలో రాజకీయాల్లో విలువలకోసం తపించే చంద్రబాబునాయుడు రాజీనామాచేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
గతంలో ఒక రైలు ప్రమాదం జరిగినందుకే ఆ శాఖమంత్రిగా బాధ్యత వహించి లాల్‌బహదూర్‌ శాస్త్రి గారు రాజీనామాచేశారు. ఆ స్థాయిలో ఇప్పటి రాజకీయనాయకుల నుంచి స్పందనను ఆశించడం అత్యాశే అవుతుంది.

కొద్ది సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నేదరుమల్లి జనార్ధన్‌రెడ్డి క్యాపిటేషన్‌ ఫీజు వ్యవహారంలో కోర్టుతీర్పు తనకు వ్యతిరేకంగా వచ్చేసరికి రాజీనామా చేశారు. జనార్ధన్‌రెడ్డి శిష్యుడు చంద్రబాబుకూడా ఇప్పుడు గురువుగారి బాటలో పయనించే అవకాశం ఉందా?

చాలా కాలం క్రితం నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ట్రాన్స్‌పోర్టు సంబంధిత అంశంలో కోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కటువుగా వ్యాఖ్యానించినందుకు సంజీవరెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామాచేశారు. ఎప్పుడూ రాజకీయాల్లో విలువల గురించి, నీతి నియమాల గురించి మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు ఎలా స్పందిస్తారో చూడాలి.

కోర్టు తీర్పు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌కు కూడా చెంపపెట్టులాంటిదే. రోజా సస్పెన్షన్‌ తీర్మానాన్ని అసెంబ్లీలో మూవ్‌ చేసిన సీనియర్‌ మంత్రి, ఎప్పుడూ అసెంబ్లీ రూల్స్‌, రెగ్యులేషన్స్‌ గురించి సుద్దులు చెప్పే యనమల రామకృష్ణుడికి కూడా కోర్టు తీర్పు చాలా అవమానకరమే.

సుప్రీంకోర్టు రోజా సస్సెన్షన్‌ వ్యవహారంలో ఘాటైన విమర్శలు చేసిన సమయంలోనే అసెంబ్లీలో చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షం విప్‌ జారీచేసే అవకాశం లేకుండా రాజ్యాంగ విరుద్ధమైన తీర్మానం చేసింది. కాబట్టి వీళ్ల నుంచి రాజీనామాలు ఆశించడం రాజకీయాల్లో విలువలను కోరుకునే పౌరులకు ఆశా భంగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News