స్పీకర్‌పై వీగిన అవిశ్వాసం, వైసీపీ నుంచి 10 మంది గైర్హాజరు

స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. తీర్మానంపై చర్చ అనంతరం డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ఓటింగ్ నిర్వహించారు. వైసీపీ తీర్మానానికి అనుకూలంగా 57 మంది వ్యతిరేకంగా 97 మంది నిలబడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు. ఏడాది సస్పెన్షన్‌ కారణంగా రోజా సభకు రాలేకపోయారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమీపబంధువు మరణించడంతో అనిల్ కుమార్ సభకు రాలేకపోయారని వైసీపీనేతలు […]

Advertisement
Update:2016-03-15 11:14 IST

స్పీకర్ కోడెల శివప్రసాద్‌పై వైసీపీ పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. తీర్మానంపై చర్చ అనంతరం డిప్యూటీ స్పీకర్ మండలి బుద్దప్రసాద్ ఓటింగ్ నిర్వహించారు. వైసీపీ తీర్మానానికి అనుకూలంగా 57 మంది వ్యతిరేకంగా 97 మంది నిలబడ్డారు. వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ అయిన ఎనిమిది మంది వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరుకాలేదు. ఏడాది సస్పెన్షన్‌ కారణంగా రోజా సభకు రాలేకపోయారు. వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఓటింగ్‌లో పాల్గొనలేదు. సమీపబంధువు మరణించడంతో అనిల్ కుమార్ సభకు రాలేకపోయారని వైసీపీనేతలు చెబుతున్నారు. అధికార పార్టీనుంచి 11మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. వారిలో మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఉన్నారు. వ్యతిగత కారణాలవల్ల వీరంత సభకు రాలేకపోయారని చెబుతున్నారు. తీర్మానం వీడిపోవడంతో స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ను చైర్‌పైకి డిప్యూటీ స్పీకర్‌ ఆహ్వానించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన కోడెల… తన విధులను ఎలాంటి పక్షపాతం లేకుండా నిర్వహిస్తానన్నారు. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొనన్నానని చెప్పారు. తనపట్ల విశ్వాసం ఉంచిన సభకు ధన్యవాదాలు అన్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News