చాలా కష్టపడ్డావ్ అన్న... ఇంకాస్త తిట్టి ఉంటే మంత్రి పదవి వచ్చేది!
అవిశ్వాసతీర్మానంపై వైసీపీ తరపున జగన్ అసెంబ్లీలో ప్రసంగించారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. పరిటాల రవి హత్య కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నారని… మరి అవే ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ దివాకర్ రెడ్డిని చంద్రబాబు ఎలా పార్టీలో చేర్చుకున్నారని జగన్ ప్రశ్నించారు. వంగవీటి రంగాను చంద్రబాబు ఏ విధంగా దగ్గరుండి హత్య చేయించింది సీనియర్ నేత హరిరామజోగయ్య స్పష్టంగా తన పుస్తకంలో వెల్లడించారన్నారు. చంద్రబాబు మనుషులను ఎలా చంపిస్తారో రంగా హత్య ఒక ఉదాహరణ అన్నారు. […]
అవిశ్వాసతీర్మానంపై వైసీపీ తరపున జగన్ అసెంబ్లీలో ప్రసంగించారు. టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు. పరిటాల రవి హత్య కేసులో తనపై ఆరోపణలు చేస్తున్నారని… మరి అవే ఆరోపణలు ఎదుర్కొన్న జేసీ దివాకర్ రెడ్డిని చంద్రబాబు ఎలా పార్టీలో చేర్చుకున్నారని జగన్ ప్రశ్నించారు. వంగవీటి రంగాను చంద్రబాబు ఏ విధంగా దగ్గరుండి హత్య చేయించింది సీనియర్ నేత హరిరామజోగయ్య స్పష్టంగా తన పుస్తకంలో వెల్లడించారన్నారు. చంద్రబాబు మనుషులను ఎలా చంపిస్తారో రంగా హత్య ఒక ఉదాహరణ అన్నారు. రంగా హత్య కేసులో ముద్దాయిలంతా ఇదే అసెంబ్లీలో ఉన్నారన్నారు. గజరాజు వెళ్తుంటే కుక్కలు మెరిగినట్టుగా టీడీపీ నేతల తీరు ఉందన్నారు. చంద్రబాబు నుంచి మంత్రుల వరకు అంతా నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడుతున్నారని విమర్శించారు.
టీడీపీ నేతలు మాట్లాడుతున్న సమయంలో ఎవరూ అడ్డుతగల్లేదు. కానీ జగన్ మాట్లాడడం మొదలుపెట్టగానే యనమల, దేవినేని ఉమ, కళా వెంక్రటావు, తోట త్రిమూర్తులు తదితరులు నిమిషాల వ్యవధిలోనే పదేపదే అడ్డుపడ్డారు. జగన్ ఒక నిమిషం మాట్లాడగానే టీడీపీ నేతలు ఒక్కొక్కరు ఐదు పది నిమిషాల పాటు మాట్లాడారు. తోట త్రిమూర్తులు జగన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఈ సమయంలో త్రిమూర్తులుపై జగన్ సెటైర్ వేశారు. తనను తిట్టడం ద్వారా తోట త్రిమూర్తులు అన్నా మంత్రి పదవికి దగ్గరగా వెళ్లారని అన్నారు. ఇంకాస్త గట్టిగా తనను తిట్టి ఉంటే త్రిమూర్తులుకు మంత్రి పదవి గ్యారంటీగా వచ్చేదన్నారు. కళ్ల ముందే ఫిరాయింపుల చట్టాన్ని తూట్లు పొడుస్తూ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుకు దమ్ముంటే ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని విమర్శించారు. విప్ జారీ చేశామని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇక్కడ లేకపోయినా, సభకు వచ్చి చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓటు వేయకపోయినా అనర్హత వేటు పడాల్సిందేనన్నారు జగన్. ఇంతలోనే మరోసారి మైక్ కట్ చేశారు స్పీకర్. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు జగన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని యనమల అన్నారు. సిగ్గులేకుండా తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాకుండా దాన్ని కూడా వక్రీకరించే ప్రయత్నాన్ని మంత్రి యనమల చేయడం దారుణమని జగన్ అన్నారు.
Click on Image to Read: