హేయ్, మగాడివైతే, ఖబర్దార్, సిగ్గులేదా, ఉగ్రవాది,రౌడీ.. etc- సభలో సభ్యత కరువు
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీ తీరు బాధాకరంగా అనిపించింది. చర్చ సంగతి దేవుడెరుగు. ఇరు పక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో ముందుకెళ్లాయి. నోటికి ఎంత మాట వస్తే అంతమాట అనేసుకుంటూ అసెంబ్లీ పరువును బజారు మీదకు తెచ్చారు. మగాడివైతే, సిగ్గులేదా, ఉగ్రవాది, హేయ్ … ఇలా రకరకాల మాటాలతో నేతలు తమ సభ్యతను కాసేపు పక్కనపెట్టేశారు. ఎప్పటిలాగే జగన్ మాట్లాడుతున్న సమయంలో ప్రతి అర నిమిషానికొకసారి మైక్ కట్ అయింది. అధికారపక్షం నుంచి చంద్రబాబుతోపాటు అచ్చెన్నాయుడు, యనమల, […]
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా అసెంబ్లీ తీరు బాధాకరంగా అనిపించింది. చర్చ సంగతి దేవుడెరుగు. ఇరు పక్షాలు సవాళ్లు, ప్రతిసవాళ్లతో ముందుకెళ్లాయి. నోటికి ఎంత మాట వస్తే అంతమాట అనేసుకుంటూ అసెంబ్లీ పరువును బజారు మీదకు తెచ్చారు. మగాడివైతే, సిగ్గులేదా, ఉగ్రవాది, హేయ్ …
ఇలా రకరకాల మాటాలతో నేతలు తమ సభ్యతను కాసేపు పక్కనపెట్టేశారు. ఎప్పటిలాగే జగన్ మాట్లాడుతున్న సమయంలో ప్రతి అర నిమిషానికొకసారి మైక్ కట్ అయింది. అధికారపక్షం నుంచి చంద్రబాబుతోపాటు అచ్చెన్నాయుడు, యనమల, దేవినేని ఉమ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కాల్వ శ్రీనివాస్, బోండా ఉమ లాంటి నేతలంతా మూకుమ్మడిగా దాడి చేశారు. పెద్దమనిషి తరహాలో మధ్యలో ఉండే బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు కూడా చంద్రబాబుకు గట్టి మద్దతుగా నిలబడ్డారు. ప్రతిపక్షాన్నే పదేపదే తప్పుపట్టారు. విపక్షంచేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని సూచించాల్సిందిపోయి ఇప్పటికిప్పుడే విపక్షం తన ఆరోపణలను నిరూపించాలంటూ చంద్రబాబు వాదననే విష్ణుకుమార్ రాజు వినిపించారు.
సోలార్ వ్యవహారంలో రూ. 7వేల కోట్ల కుంభకోణం జరిగిందని జగన్ ఆరోపించడంతో రచ్చ జరిగింది. మొత్తం 20 రంగాల్లో జరిగిన అవినీతిని జగన్ సభ ముందుంచారు. అయితే మధ్యలో జోక్యంచేసుకున్న చంద్రబాబు సోలార్ కుంభకోణాన్ని నిరూపించాలని ఎదురుదాడిచేశారు. అది కూడా ఇప్పటికిప్పుడు సభలోనే నిరూపించాలని లేని పక్షంలో సభ ముందుకెళ్లడానికి వీల్లేదని చంద్రబాబే స్వయంగా అడ్డుపడ్డారు. జగన్ మాట్లాడేందుకు ప్రయత్నించిన ప్రతీసారి ముందు వీటిని నిరూపించండి అని అడ్డుపడ్డారు.
ఒక దశలో సహనం కోల్పోయిన చంద్రబాబు ప్రతిపక్షాన్ని పరుషపదజాలంతో దూషించారు. ”హేయ్ ఏం మాట్లాడుతున్నావ్ సిగ్గులేకుండా” అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. వైసీపీ దివాలాకోరు పార్టీ అని దోపిడిపార్టీ అని విమర్శించారు. 30ఏళ్లుగా నీతినిజాయితీగా బతికిన వ్యక్తిని తానని చంద్రబాబు చెప్పుకున్నారు. వైసీపీ నేతగా జగన్‌ను దించేసి కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. దమ్ముంటే చేసిన ఆరోపణలు నిరూపించాలన్న చంద్రబాబు సవాల్‌కు జగన్ స్పందించారు. చంద్రబాబుకు దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు. గతంలో చంద్రబాబు ఔటర్ రింగ్ రోడ్డు భూముల విషయంలో డిమాండ్ చేయగానే అప్పటి సీఎంగా ఉన్న రాజశేఖర రెడ్డి సీబీఐ విచారణకు ఆదేశించారని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబుకే దమ్ము, ధైర్యం లేక విచారణనుంచి పారిపోతున్నారని జగన్ అన్నారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ జగన్‌కు దమ్ము ధైర్యం ఉంటే, మగాడైతే, రాయలసీమలో పుట్టిన వాడైతే అవినీతి ఆరోపణలు నిరూపించాలని తీవ్ర పరుషపదజాలంతో విమర్శించారు.
ఇందుకు స్పందించిన జగన్ తాను మగాడిని కాబట్టే ప్రతిపక్షంలో ఉన్నా కూడా కేంద్రంతో పోరాటం చేశానని జగన్ అన్నారు. దేవినేని ఉమ కూడా జగన్ పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఖబర్దార్ అంటూ వేలు చూపిస్తూ హెచ్చరించారు. బోండా ఉమ మాట్లాడుతూ జగన్ ఒక ఆర్ధిక ఉగ్రవాది అని ఆరోపించారు. ఓ దశలో ఈ సవాళ్లు ప్రతిసవాళ్లు కొనసాగుతూనే ఉండడంతో సభను పది నిమిషాలు వాయిదావేశారు. మొత్తం మీద సభలో జగన్ అర నిమిషం మాట్లాడిన ప్రతీసారీ అధికారపక్ష సభ్యులు వరుసపెట్టి పది నిమిషాల పాటు తిట్టిపోశారు. జగన్ మాట్లాడినా ప్రతీసారీ మూగబోయిన మైకులకు అధికారపార్టీ సభ్యులు మాట్లాడిన సమయంలో ఎలాంటి అంతరాయం కలగకపోవడం విశేషం.
Click on Image to Read: