పిల్ల‌లు రేప్ వీడియోలు చూస్తున్నారు జాగ్ర‌త్త‌!

నేటి పిల్ల‌లు టెక్నాల‌జీలో దూసుకుపోతున్నారు…అని సంబ‌ర‌ప‌డే త‌ల్లిదండ్రుల‌కు ఇది షాకింగ్ న్యూసే. 16నుండి21 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారిలో 66శాతం మంది అబ్బాయిలు వారానికి ఏడు గంట‌ల చొప్పున నీలి చిత్రాలు చూస్తున్నార‌ని ఒక స‌ర్వే వెల్ల‌డించింది. అలాగే 30శాతం అమ్మాయిలు వారానికి ఐదుగంట‌లు పోర్న్ చిత్రాలు చూస్తున్నారు. మ‌గ‌పిల్ల‌ల‌యితే తొమ్మిదేళ్ల వ‌య‌సునుండే వీటిని చూస్తున్నారు. ఇంకా ఈ స‌ర్వేలో అనేక భ‌యంక‌ర‌మైన నిజాలు వెల్ల‌డ‌య్యాయి. క‌ర్ణాట‌క‌లో 183 కాలేజీల‌కు చెందిన‌ 3,500మంది విద్యార్థుల‌ను ప్ర‌శ్నించారు. రెస్క్యూ అనే ఒక స్వ‌చ్ఛంద సంస్థ ఈ స‌ర్వేని […]

Advertisement
Update:2016-03-10 16:17 IST

నేటి పిల్ల‌లు టెక్నాల‌జీలో దూసుకుపోతున్నారు…అని సంబ‌ర‌ప‌డే త‌ల్లిదండ్రుల‌కు ఇది షాకింగ్ న్యూసే. 16నుండి21 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న వారిలో 66శాతం మంది అబ్బాయిలు వారానికి ఏడు గంట‌ల చొప్పున నీలి చిత్రాలు చూస్తున్నార‌ని ఒక స‌ర్వే వెల్ల‌డించింది. అలాగే 30శాతం అమ్మాయిలు వారానికి ఐదుగంట‌లు పోర్న్ చిత్రాలు చూస్తున్నారు. మ‌గ‌పిల్ల‌ల‌యితే తొమ్మిదేళ్ల వ‌య‌సునుండే వీటిని చూస్తున్నారు. ఇంకా ఈ స‌ర్వేలో అనేక భ‌యంక‌ర‌మైన నిజాలు వెల్ల‌డ‌య్యాయి.

క‌ర్ణాట‌క‌లో 183 కాలేజీల‌కు చెందిన‌ 3,500మంది విద్యార్థుల‌ను ప్ర‌శ్నించారు. రెస్క్యూ అనే ఒక స్వ‌చ్ఛంద సంస్థ ఈ స‌ర్వేని నిర్వ‌హించింది. విద్యార్థుల‌ను నేరుగా కాకుండా గ్రూపుగా చేసి వారి స్నేహితుల‌ను గురించి ప్ర‌శ్నిస్తూ, అస‌లు యువ‌త‌రంలో రేప్ వీడియోల‌ను ఎంత‌మంది చూస్తుండ‌వ‌చ్చు, వారానికి ఎన్ని గంట‌లు చూస్తుంటారు…అంటూ ప‌రోక్షంగా అడుగుతూ వివ‌రాలు రాబట్టారు. బీద‌ర్‌, మైసూరు, చామ‌రాజ‌న‌గ‌ర్‌, మాండ్య‌, ధ‌ర్వాడ్‌, బెల‌గావి, బెంగ‌లూరు త‌దిత‌ర ప్రాంతాల్లో ఈ స‌ర్వే నిర్వహించారు. ప్ర‌స్తుతం మంగ‌ళూరులో చేస్తున్నారు.

ఇందులో 30శాతం మంది మ‌గ‌పిల్ల‌లు హింసాత్మ‌క‌మైన పోర్న్‌, వారానికి 19 రేప్ వీడియోల చొప్పున చూస్తున్నారు. ఏటా 1.7ల‌క్ష‌ల మంది విద్యార్థులు కొత్త‌గా రేప్ వీడియోల‌నుచూస్తున్నారు. డిగ్రీకి చేరే స‌మ‌యానికే విద్యార్థులు దాదాపు 4,900 అత్యాచారాల‌ను చూస్తున్నార‌ని ఈ స‌ర్వేలో తేలింది. 84శాతం మంది పోర్న్ చూడ‌టం పెరుగుతున్న‌ద‌ని, విద్యార్థులు వాటికి దాసులుగా మారుతున్నార‌ని చెప్పారు. 83శాతం మంది తాము వీటివ‌ల‌న ప్ర‌భావితం అవుతున్నామ‌న్నారు. 74శాతం మంది వీటికార‌ణంగా సెక్స్ వ‌ర్క‌ర్ల వ‌ద్ద‌కు వెళ్ల‌టం జ‌రుగుతోంద‌ని చెప్పారు. ఈ రేప్ వీడియోల‌కు చూస్తున్న‌వారిలో ప‌దిశాతం మంది ప్ర‌భావితం అయినా క‌ర్ణాట‌క‌లో ఒక సంవ‌త్స‌రంలో 13వేల‌మంది కొత్త రేపిస్టులు త‌యార‌వుతార‌ని స‌ర్వే నిర్వ‌హించిన సంస్థ సిఇఓ అభిషేక్ అంటున్నారు.

పిల్ల‌లకు అందుబాటులో ఉంటున్న ఇంట‌ర్‌నెట్ వారి జీవితాల్లో ఊహించ‌లేని మార్పులు తెచ్చింద‌ని అభిషేక్ హెచ్చ‌రిస్తున్నారు. రెస్క్యూ సంస్థ సైబ‌ర్ నైతిక విలువల గురించి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్న‌ది. అలా ఒక ప్రాంతంలో వారు ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌క‌ముందు 37శాతం మంది అమ్మాయిలు, పోర్న్ వ‌ల‌న హాని ఏమీ లేద‌ని, అబార్ష‌న్ అవ‌కాశం ఉంటుంది క‌నుక పెళ్లికి ముందు సెక్స్ ఓకే అని చెప్పారు. రెస్క్యూ ప్రోగ్రామ్ త‌రువాత కూడా ఆరుశాతం మంది అదే అభిప్రాయంతో ఉన్నారు.

అలాగే మంగ‌ళూరులోని ఒక కాలేజి ప్రిన్స్‌పాల్, త‌మ కాలేజిలో అమ్మాయిలు, అబ్బాయిల‌ను అస‌లు మాట్లాడుకోనివ్వ‌మ‌ని చెప్పాడు. అయితే స‌ర్వే చేసిన 100మంది విద్యార్థుల్లో 50శాతం మంది త‌మ క్లాస్‌మెట్స్‌తో త‌మ‌కు సంబంధం ఉంద‌ని చెప్పారు. భార‌త్‌మొత్తం స‌ర్వే నిర్వ‌హించాక రెస్క్యూ సంస్థ సెప్టెంబ‌రులో పోర్న్‌మీద నిషేధాన్ని కోరుతూ ఒక ప్ర‌జాప్ర‌యోజ‌న వ్యాజ్యాన్నివేయ‌బోతున్న‌ట్టుగా అభిషేక్ తెలిపారు.

Tags:    
Advertisement

Similar News