నయా ట్రెండ్- ఎదురుదాడిలో బాబు కొత్త దాడి
రాజధాని భూముల కుంభకోణంపై అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సాధారణంగా సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే వరకు సభ జరగనివ్వబోమని ప్రతిపక్షం అడ్డుకోవడం పరిపాటి. కానీ బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు కొత్తరకం ట్రెండ్‌ను సృష్టించారు. తమ డిమాండ్‌పై తేల్చే వరకు సభ ముందుకెళ్లడానికి వీల్లేదంటూ చంద్రబాబే చెప్పి ఆశ్చర్యపరిచారు. రాజధాని ఎక్కడొస్తుందో ముందే చెప్పి టీడీపీ నేతలు బినామీల చేత రాజధానిలో భూములు కొనేలా చేశారని జగన్ ఆరోపించారు.ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపారని […]
రాజధాని భూముల కుంభకోణంపై అసెంబ్లీలో విచిత్రమైన పరిస్థితి కనిపించింది. సాధారణంగా సభను ప్రతిపక్షాలు అడ్డుకుంటాయి. ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించే వరకు సభ జరగనివ్వబోమని ప్రతిపక్షం అడ్డుకోవడం పరిపాటి. కానీ బుధవారం అసెంబ్లీలో చంద్రబాబు కొత్తరకం ట్రెండ్‌ను సృష్టించారు. తమ డిమాండ్‌పై తేల్చే వరకు సభ ముందుకెళ్లడానికి వీల్లేదంటూ చంద్రబాబే చెప్పి ఆశ్చర్యపరిచారు.
రాజధాని ఎక్కడొస్తుందో ముందే చెప్పి టీడీపీ నేతలు బినామీల చేత రాజధానిలో భూములు కొనేలా చేశారని జగన్ ఆరోపించారు.ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిపారని ఆరోపించారు. దీంతో జోక్యం చేసుకున్న చంద్రబాబు … ఇద్దరు మంత్రులపై జగన్ ఆరోపణలు చేశారని వాటిని నిరూపించాలని కోరారు. అది కూడా ఇప్పటికిప్పుడు సభలోనే నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకుంటే జగన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతవరకు సభ ముందుకు నడవకూడదని చెప్పారు. ఇందుకు స్పందించిన జగన్ … తాను చేసిన ఆరోపణకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ చేశారు. కానీ చంద్రబాబు మాత్రం జగనే నిరూపించాలని అంతవరకు సభ సాగదని మూడోసారి కూడా చెప్పారు. సీబీఐ విచారణ విషయంలో మాత్రం చంద్రబాబు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఆఖరికి సీబీఐతోనే కాదు మరే విచారణకు ఆదేశించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. విచిత్రం ఏమిటంటే…
సాధారణంగా ప్రతిపక్షం ఆరోపణ చేస్తే ప్రభుత్వం దానిపై విచారణకు ఆదేశించడం, లేకుంటే తిరస్కరించడం జరుగుతుంది. కానీ ఏపీ ప్రభుత్వం రివర్స్‌లో ప్రతిపక్షమే ఆరోపణలు నిరూపించాలనడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండకపోచ్చు. ఏ కుంభకోణంపైనైనా నిజానీజాలు బయటకు తీయాలంటే అది దర్యాప్తు సంస్థలకే సాధ్యమవుతుంది. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాలే గానీ ప్రతిపక్షమే నిరూపించాలి… అది కూడా అసెంబ్లీలోనే ఈ క్షణమే నిరూపించాలని అంతవరకు సభ ముందుకెళ్లడానికి వీల్లేదని సీఎం స్థాయిలో చంద్రబాబు చెప్పడం ఆశ్చర్యమే. మొత్తం మీద ప్రభుత్వం విచారణ నుంచి పారిపోతోందన్న భావనను అధికారపక్షమే కల్పించింది. ఏపీ అసెంబ్లీలో ఇదో కొత్త ట్రెండే.
Click on image to read: