ఆదిరెడ్డిని కుండలో కలుపుకోలేదా! రోజా సభలోనే ఉన్నారా?

రాజధాని భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు.  దీంతో వైసీపీ సభ్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటును వేసింది.  ఈ లిస్ట్‌ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చదివారు. సస్పెన్షన్ లిస్ట్‌లో మొదటి పేరే ఆదినారాయణరెడ్డిది ఉండడం విశేషం. ఆదినారాయణరెడ్డి పేరు చదివిన యనమల వెంటనే తేరుకున్నారు. ఈయన లేరు కదా అని చిన్నగా అన్నారు. ఆ తర్వాత మిగిలిన వారి లిస్ట్ చదివారు. మధ్యలో రోజా(ఆమెపై ఏడాదిపాటు సస్పెన్షన్ అమలులో […]

Advertisement
Update:2016-03-09 10:57 IST

రాజధాని భూములపై సీబీఐ విచారణ జరిపించాలని వైసీపీ సభ్యులు సభను అడ్డుకున్నారు. దీంతో వైసీపీ సభ్యులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటును వేసింది. ఈ లిస్ట్‌ను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చదివారు. సస్పెన్షన్ లిస్ట్‌లో మొదటి పేరే ఆదినారాయణరెడ్డిది ఉండడం విశేషం. ఆదినారాయణరెడ్డి పేరు చదివిన యనమల వెంటనే తేరుకున్నారు. ఈయన లేరు కదా అని చిన్నగా అన్నారు. ఆ తర్వాత మిగిలిన వారి లిస్ట్ చదివారు. మధ్యలో రోజా(ఆమెపై ఏడాదిపాటు సస్పెన్షన్ అమలులో ఉంది) పేరు కూడా చదవబోయారు. శ్రీమతి ఆర్‌ కే… అని టక్కున ఆపేశారు. లిస్ట్ చదివిన తర్వాత మొదటి పేరును(ఆదినారాయణరెడ్డి) మినహాయించాలని స్పీకర్‌ను యనమల కోరారు. అనంతరం లిస్ట్‌లో ఉన్న సభ్యులను స్పీకర్ బుధవారం సభముగిసేవరకు సస్పెండ్ చేశారు. ఇటీవలే టీడీపీలో చేరిన ఆదినారాయణరెడ్డితో పాటు, ఏడాది సస్పెన్షన్ లో ఉన్న రోజా పేరును కూడా లిస్ట్‌ లో ఉంచడం పట్ల సభ నడుస్తున్న తీరుపై విమర్శలు వస్తున్నాయి.

Click on image to read:

 

Tags:    
Advertisement

Similar News