సంక్రాంతి అల్లుడి ముందు పరువు తీశారు అధ్యక్షా…
ఏపీలో రైతు రుణమాఫీ అంశంపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి … చంద్రబాబు జన్మించిన చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా వివరించారు. సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుడి సమక్షంలో ఒక రైతు పరువును బ్యాంకర్లు ఎలా తీశారో వివరించారు. ‘’చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట గ్రామంలో ఒక రైతు తనకు సంక్రాంతి పండుగ నాడు అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాలకు ఫోన్ చేశారు […]
ఏపీలో రైతు రుణమాఫీ అంశంపై అసెంబ్లీలో హాట్‌హాట్‌గా చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి … చంద్రబాబు జన్మించిన చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన ఒక సంఘటనను ఉదాహరణగా వివరించారు. సంక్రాంతి పండుగకు వచ్చిన అల్లుడి సమక్షంలో ఒక రైతు పరువును బ్యాంకర్లు ఎలా తీశారో వివరించారు.
‘’చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం గానుగపెంట గ్రామంలో ఒక రైతు తనకు సంక్రాంతి పండుగ నాడు అర్థరాత్రి 12 గంటల 45 నిమిషాలకు ఫోన్ చేశారు అధ్యక్షా. చెవిరెడ్డి గారు అప్పు కట్టలేదని బ్యాంకువాళ్లు ఇంటి దగ్గరకు వచ్చి గొడవ చేస్తున్నారు. రోడ్డు మీద నిలబడి రచ్చ చేస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావడంలేదు. కొన్ని నెలలుగా తాను ఇంటి వద్ద కూడా ఉండడం లేదు. పండక్కు అల్లుడు వచ్చాడు కదా అని ఈ రాత్రి ఇంటి దగ్గర పడుకున్నాను. వచ్చి ఇలా గొడవ చేస్తున్నారు’’ అని రైతు ఫోన్ చేసి వివరించినట్టు చెవిరెడ్డి చెప్పారు. ఆ సమయంలో తాను బ్యాంకర్లతో మాట్లాడగా…
”సర్… రోజూ పల్లెల వెంబడి తిరుగుతున్నాం. జీరంగుల్లలా తిరుగుతున్నా ఒక్క రైతు కూడా దొరకడం లేదు. అందుకే పండుగ పూట ఖచ్చితంగా ఇంటి వద్ద ఉంటారనే వచ్చాం. మా అప్పు కడితే గానీ వెళ్లే పరిస్థితి లేదు’’ అని బ్యాంకర్లు చెప్పారని చెవిరెడ్డి వివరించారు. చివరకు అల్లుడి ముందు జరిగిన అవమానం భరించలేక సదరు రైతు పొలం అమ్మి బాకీ కట్టాల్సి వచ్చిందని చెవిరెడ్డి వివరించారు. చంద్రబాబు పుట్టిన నియోజకవర్గంలోనే ఇలా జరిగిందటే మిగిలిన నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. కావాలంటే తాను చెప్పింది నిజమో కాదో మంత్రిగారు విచారణ జరిపించుకోవాలని సూచించారు. ఇప్పటికైనా బ్యాంకర్ల బారి నుంచి రైతులను కాపాడాలని కోరారు. పల్లెల్లో రైతులు బతికే పరిస్థితి కల్పించాలని విజ్ఞప్తి చేశారు చెవిరెడ్డి.
Click on image to read: