కొయంబ‌త్తూరులో… ఊటీ టాక్సీ డ్రైవ‌ర్ హ‌త్య‌!

ఊటీ నుండి కొయంబ‌త్తూరుకి ప్ర‌యాణీకుల‌ను తీసుకువ‌చ్చిన టాక్సీ డ్రైవ‌ర్ హ‌త్య‌కు గుర‌య్యాడు. య‌తిరాజ్ అనే 60 సంవ‌త్స‌రాల డ్రైవ‌ర్‌, టాక్సీని బుక్‌చేసుకున్న‌వారిని తీసుకుని ఆదివారం కొయంబ‌త్తూరు వ‌చ్చాడు. అత‌ను సోమ‌వారం త‌న టాక్సీలోనే హ‌త్య‌కు గుర‌య్యాడు.  అత‌ని ట్యాక్సీ, కొయంబ‌త్తూరులోని అగ్రిక‌ల్చ‌ర్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైర‌క్ట‌ర్ కార్యాల‌యంకి చేరువ‌లో ఆగి ఉండ‌గా అందులో య‌తిరాజు ప్రాణాలు కోల్పోయి క‌నిపించాడు. దుండ‌గులు అత‌డిని షాల్‌తో ఉరితీసిన‌ట్టుగా పోలీసుల ప‌రిశీల‌న‌లో తేలింది. హ‌తుని ముఖంపై గాయాలు సైతం క‌న‌బ‌డుతున్నాయి. పోలీసులు […]

Advertisement
Update:2016-03-08 06:43 IST

ఊటీ నుండి కొయంబ‌త్తూరుకి ప్ర‌యాణీకుల‌ను తీసుకువ‌చ్చిన టాక్సీ డ్రైవ‌ర్ హ‌త్య‌కు గుర‌య్యాడు. య‌తిరాజ్ అనే 60 సంవ‌త్స‌రాల డ్రైవ‌ర్‌, టాక్సీని బుక్‌చేసుకున్న‌వారిని తీసుకుని ఆదివారం కొయంబ‌త్తూరు వ‌చ్చాడు. అత‌ను సోమ‌వారం త‌న టాక్సీలోనే హ‌త్య‌కు గుర‌య్యాడు. అత‌ని ట్యాక్సీ, కొయంబ‌త్తూరులోని అగ్రిక‌ల్చ‌ర్ డిపార్ట్‌మెంట్ జాయింట్ డైర‌క్ట‌ర్ కార్యాల‌యంకి చేరువ‌లో ఆగి ఉండ‌గా అందులో య‌తిరాజు ప్రాణాలు కోల్పోయి క‌నిపించాడు. దుండ‌గులు అత‌డిని షాల్‌తో ఉరితీసిన‌ట్టుగా పోలీసుల ప‌రిశీల‌న‌లో తేలింది. హ‌తుని ముఖంపై గాయాలు సైతం క‌న‌బ‌డుతున్నాయి. పోలీసులు శ‌వాన్ని కొయంబ‌త్తూరు మెడిక‌ల్ కాలేజి హాస్ప‌ట‌ల్‌కి పోస్ట్‌మార్ట‌మ్ నిమిత్తం పంపారు. కారులో ఉన్న కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ హ‌త్య‌వెనుక ఉన్న కార‌ణం ఏమిట‌న్న‌ది మిస్ట‌రీగా మార‌గా, నేర‌స్తుల‌ను ప‌ట్టుకునేందుకు పోలీస్ అధికారులు ప్ర‌త్యేక బృందాల‌ను నియ‌మించారు. ఆ ప్రాంతంలో ఉన్న సిసిటివి ఫుటేజిని సైతం ప‌రిశీలిస్తామ‌ని వారు వెల్ల‌డించారు. య‌తిరాజ్ ఊటీ నుండి ఎవ‌రిని తీసుకుని కొయంబ‌త్తూరు వ‌చ్చాడు…అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు ప్ర‌త్యేక బృందాలు ఊటీ వెళ్లాయి. య‌తిరాజుకి భార్య, ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News