హాట్ హాట్‌గా మహిళలపై చర్చ- జగన్, అధికార పక్షం మధ్య కౌంటర్, ఎన్ కౌంటర్
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పరిణామాలు చూస్తుంటే స్త్రీలకు రాష్ట్రంలో గౌరవం ఇస్తున్నామా లేదా అన్నది గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి” అని ఆయన అన్నారు. ఇదే సభలో నా సోదరి రోజాను రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. చట్టాన్ని తయారు చేసే సభలోనే చట్టాన్ని ఉల్లంఘించి ఒక మహిళను బయటకు పంపిన ఘనత ఈ […]
మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా సాధికారతపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. “పరిణామాలు చూస్తుంటే స్త్రీలకు రాష్ట్రంలో గౌరవం ఇస్తున్నామా లేదా అన్నది గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి” అని ఆయన అన్నారు. ఇదే సభలో నా సోదరి రోజాను రూల్స్‌కు విరుద్ధంగా ఏడాది పాటు సస్పెండ్ చేశారు. చట్టాన్ని తయారు చేసే సభలోనే చట్టాన్ని ఉల్లంఘించి ఒక మహిళను బయటకు పంపిన ఘనత ఈ సభకే దక్కుతుందని, ఇసుక మాఫియాకు అడ్డుపడుతున్నారని ఒక మహిళా తహసీల్దార్‌ను జుట్టుపట్టుకుని ఎమ్మెల్యే లాగితే కేసులు లేవు, అరెస్టులు లేవని, అంగన్ వాడీ మహిళలను ఇదే ఎమ్మెల్యే బూతులు తిడితే కనీసం కేసులు లేవని, రిషితేశ్వరి అనే నాగార్జున యూనివర్సిటీ విద్యార్ధిని అధికార పార్టీకి చెందిన కామాంధులకు బలైపోతే కనీసం ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోలేదని ఘాటుగా విమర్శించారు.
విజయవాడ.. అంటే మన రాజధానిలో వడ్డీ వ్యాపారం పేరుతో డబ్బులిచ్చి… తిరిగి చెల్లించలేని పేద మహిళలను సెక్స్ రాకెట్లలోకి దింపింది మీరు కాదా ?. వాటిని రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్ చేసింది అధికార పార్టీ నేతలు కాదా? ఇదే సభలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రమేయం ఉన్నట్టు సాక్ష్యాలు ఉన్నా కేసులు పెట్టరు. కేసులు పెట్టినా వారిని కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు అని జగన్ దుయ్యబట్టారు. ఇంతలో జోక్యం చేసుకున్న మంత్రులు గంటా, చినరాజప్పలు పాత విషయాలు చెప్పవద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. తిరిగి మాట్లాడడం జగన్ మొదలుపెట్టగానే మళ్లీ మైక్ కట్ చేశారు. ఈసారి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకున్నారు.
అయనేమన్నారంటే… ‘’ ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూడవద్దని కోరుతున్నా. మహిళా దినోత్సవం సంద్భంగా ప్రభుత్వంపై దాడి నీచమైనది. గతంలో ప్రస్తావించిన అంశాలే మళ్లీ చెబుతున్నారు. ప్రతిపక్ష నాయకుడు ఒక వ్యక్తిగా వ్యవహరించాలి. ఇలా మాట్లాడడం సరికాదు’’ అని అన్నారు.
ఇలా పదేపదే మైక్ కట్ చేయడంపై జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అన్యాయాలను ప్రస్తావిస్తే మైక్ కట్ చేసి ముగ్గురు నలుగురుతో తిట్టించడం ఏమిటని స్పీకర్ ను ప్రశ్నించారు. జుట్టులాగిన ఎమ్మెల్యే ఇక్కడే ఉన్నారు. ఒక వ్యక్తి తాగి మహిళను కారులోకి లాగి బలాత్కారం చేయబోతే స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగిస్తే… ఆయన తండ్రి ఇంకా మంత్రిగా కొనసాగుతున్నారంటే అనగానే మళ్లీ మైక్ కట్ చేశారు స్పీకర్. మంత్రి రావెలకు మైక్ ఇచ్చారు.
రావెల మాట్లాడుతూ…’’ మహిళ స్వేచ్చకు పెద్దపీట వేసిన పార్టీ టీడీపీ. నా కుమారుడు తప్పు చేస్తే ఏ శిక్ష విధించడానికి సిద్ధమే. నా కుమారుడి మీద ఏ స్త్రీ అయితే ఆరోపణ చేసిందో ఆమె నాకు కూతురు లాంటిది. పరిటాల రవి హత్య కేసులో జగన్ నిందితుడు. అప్పట్లో వైఎస్ కూడా జగన్‌ను వెనుకేసుకొచ్చారు. కేసు నుంచి పేరు తీసివేసేందుకు ప్రయత్నించారు. కానీ నేను అలా చేయలేదు’’ అన్ని అన్నారు.
తిరిగి మాట్లాడిన జగన్……. ‘’ మంత్రి కొడుకు ఇంత దారుణమైన పని చేస్తే… దాన్ని కూడా జగన్ చేసిన కుట్ర అనడం కన్నా దారుణం మైనది ఏమైనా ఉంటుందా” అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తి ఇంకా మంత్రిగా ఉన్నారంటే సిగ్గుతో తలదించుకోవాలి. ఒక ఎమ్మెల్యే ఒక కార్యక్రమంలో అమ్మాయిలపై కామెంట్ చేశారంటూ పరోక్షంగా బాలకృష్ణను ప్రస్తావించారు. సదరు ఎమ్మెల్యేపై జాతీయ మీడియాలో కూడా చర్చ జరుగుతోందన్నారు.. ఆ ఎమ్మెల్యే కూడా సభలోనే ఉన్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మార్చుకోవాలని జగన్ సూచించారు.
Click on image to read: