నిజమా!… వైఎస్‌ ఫ్యామిలీని ఆది కుటుంబం అంతగా ఆదుకుందా?

వైసీపీ నుంచి టీడీపీ చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఈ మధ్య పదేపదే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.  తాజాగా వైఎస్‌ కుటుంబం తమ వల్లే పైకి వచ్చిందని ఆదినారాయణరెడ్డి కామెంట్స్ చేశారు.  వైఎస్ కుటుంబంతో తాము పైకి రాలేదని… తమ కృషి వల్లే వైఎస్ కుటుంబం పైకి వచ్చిందని చెప్పుకొచ్చారు. 1998లో వైఎస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లు మేజారిటీ తెప్పించిన ఘనత తమదేనన్నారు. ఒకప్పుడు జమ్మలమడుగులో అసలు కాంగ్రెస్ అన్నదే […]

Advertisement
Update:2016-03-08 06:15 IST

వైసీపీ నుంచి టీడీపీ చేరిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఈ మధ్య పదేపదే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా వైఎస్‌ కుటుంబం తమ వల్లే పైకి వచ్చిందని ఆదినారాయణరెడ్డి కామెంట్స్ చేశారు. వైఎస్ కుటుంబంతో తాము పైకి రాలేదని… తమ కృషి వల్లే వైఎస్ కుటుంబం పైకి వచ్చిందని చెప్పుకొచ్చారు. 1998లో వైఎస్ ఎంపీగా పోటీ చేసినప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గంలో ఐదు వేల ఓట్లు మేజారిటీ తెప్పించిన ఘనత తమదేనన్నారు.

ఒకప్పుడు జమ్మలమడుగులో అసలు కాంగ్రెస్ అన్నదే లేదని చెప్పారు. ఏజెంట్లు కూడా ఉండేవారుకాదన్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో తమకు ప్రత్యర్థి వర్గమన్నదే లేదని ఆదినారాయణరెడ్డి చెప్పారు. ఇప్పడు ఫ్యాక్షన్ వదిలేసి ఫ్యాషన్‌తో ముందుకెళ్తున్నామని చెప్పారు. రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని తనకూ ఉందన్నారు. అయితే బతిమలాడుతున్నా రాజీనామా చేసేందుకు చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. రాజీనామా అన్నది ప్రస్తుతం తన చేతిలో లేని అంశమని ఆది తేల్చేశారు. మీడియా ప్రతినిధులకు కూడా ఆదినారాయణరెడ్డి కొన్ని నీతి సూక్తులు చెప్పారు. విలేకర్లు మంచిగా రాయాలని చెబుతున్నా పుల్లచెక్కే రాతలే రాస్తున్నారని విమర్శించారు. అలా రాయకూడదని విలేకర్లకు సూచించారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News