‘’అమ్మాయిలకు కడుపు’’ వ్యాఖ్యలపై స్పందించిన బాలయ్య

‘’అమ్మాయిల వెంటపడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?.. అమ్మాయిలకు ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. మావాడు రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు. నేను ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు’’.  అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి.  న్యాయవాదుల జేఏసీ సరూర్‌నగర్‌ పీఎస్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో బాలయ్య స్పందించారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు […]

Advertisement
Update:2016-03-07 14:57 IST

‘’అమ్మాయిల వెంటపడే పాత్రలు చేస్తే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా?.. అమ్మాయిలకు ముద్దయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయాలి. అంతే కమిట్ అయిపోవాలి. మావాడు రోహిత్‌కు మా పోలికలు కొద్దిగా అయినా రావాలి. గిల్లడాలు, పొడవడాలు. నేను ఎక్కని ఎత్తులు లేవు. చూడని లోతులు లేవు’’. అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు దుమారమే లేపాయి. న్యాయవాదుల జేఏసీ సరూర్‌నగర్‌ పీఎస్‌లో బాలకృష్ణపై ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో బాలయ్య స్పందించారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. మహిళలంటే తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. మహిళలను గౌరవించడం తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన గుణమన్నారు. . సినిమా ఫంక్షన్‌లో చేసిన వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కాదన్నారు. అవి సరదాగా చేసిన వ్యాఖ్యలన్నారు. తన సినిమాలో కథాపరంగా చేసిన వ్యాఖ్యలని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా నొచ్చుకుని ఉంటే క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలను అపార్ధం చేసుకోవద్దని కోరారు. మహిళలకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు కూడా తెలిపారు బాలకృష్ణ.

Click on image to read:

 

 

Tags:    
Advertisement

Similar News