బాబు బృందానికి అమిత్ షా కౌంటర్!.. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

ఏపీలో సొంతకాళ్లపై నిలబడేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాజమండ్రిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హాజరయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో సాయం అందడం లేదని చంద్రబాబు, టీడీపీ నేతలు చెబుతున్న మాటలను పరోక్షంగా  అమిత్ షా తిప్పికొట్టారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఏడాది కాలంలో ఏపీకి లక్షా 40 వేల కోట్ల రూపాయల సాయం చేశామన్నారు.  ఏపీకి కేంద్రం చేసిన […]

Advertisement
Update:2016-03-06 13:23 IST

ఏపీలో సొంతకాళ్లపై నిలబడేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాజమండ్రిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా హాజరయ్యారు. ఏపీకి కేంద్రం నుంచి అనుకున్న స్థాయిలో సాయం అందడం లేదని చంద్రబాబు, టీడీపీ నేతలు చెబుతున్న మాటలను పరోక్షంగా అమిత్ షా తిప్పికొట్టారు. ఏపీకి కేంద్రం ఏమీ చేయడం లేదంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. ఏడాది కాలంలో ఏపీకి లక్షా 40 వేల కోట్ల రూపాయల సాయం చేశామన్నారు. ఏపీకి కేంద్రం చేసిన సాయం గురించి చెబుతూ పోతే వారం రోజులు పడుతుందన్నారు.

ఏపీలో 24 గంటల విద్యుత్ సరఫరాకు కారణం కేంద్రమేనని గుర్తు చేశారు. లక్షా 93 వేల గృహాలను ఏపీకి కేటాయించింది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. అమరావతి నిర్మాణానికి 1500 కోట్లు కేటాయించాం కదా అన్నారు. ఏపీలో రోడ్ల నిర్మాణం కోసం రూ. 65 వేల కోట్లు ఇచ్చామన్నారు. రూ. 22 వేల కోట్లతో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని దాన్ని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందన్నారు. ఎయిమ్స్ నిర్మాణానికి 1600 కోట్లు కేటాయించామన్నారు. అమిత్‌ షా ప్రసంగం మొత్తం ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన సాయాన్ని గుర్తు చేస్తూ సాగింది. కేంద్రం సాయం చేయడం లేదంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పడం ద్వారా పరోక్షంగా టీడీపీ నేతల వాదనను తిప్పికొట్టారు. ఏపీలో గ్రామస్థాయిలోనే కాకుండా బూతు స్థాయి వరకు బీజేపీని బలోపేతం చేస్తామన్నారు. చివరిలో ఏపీకి కేంద్రం అన్నివిధాలుగా సాయం చేస్తుందని చంద్రబాబు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News