బాబును వెంటాడుతున్న గతం… మంత్రి పై చర్యలు తీసుకోలేని నిస్సహాయత

చంద్రబాబు ప్రభుత్వానికి కష్టాలన్నీ కట్టకట్టుకుని వస్తున్నాయి. అధికారం ఉందన్న ధీమాతో పెద్దలు చేస్తున్న తప్పుల దెబ్బకు  గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బాబు ప్రభుత్వం ఇరుక్కుపోయింది. పరిస్థితుల దెబ్బకు చంద్రబాబు మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే రాజధాని దురాక్రమణ దెబ్బకు కుప్పకూలిన గ్రాఫ్‌ను, మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు హైదరాబాద్‌లో మహిళ విషయంలో చేసిన ఘన కార్యం దెబ్బకు గ్రాఫ్‌ పాతాలాన్ని తాకింది. రావెల కుమారుడి విషయంలో పార్టీకి చెడ్డ […]

Advertisement
Update:2016-03-05 17:47 IST

చంద్రబాబు ప్రభుత్వానికి కష్టాలన్నీ కట్టకట్టుకుని వస్తున్నాయి. అధికారం ఉందన్న ధీమాతో పెద్దలు చేస్తున్న తప్పుల దెబ్బకు గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో బాబు ప్రభుత్వం ఇరుక్కుపోయింది. పరిస్థితుల దెబ్బకు చంద్రబాబు మీడియా సమావేశాన్ని కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

ఇప్పటికే రాజధాని దురాక్రమణ దెబ్బకు కుప్పకూలిన గ్రాఫ్‌ను, మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు హైదరాబాద్‌లో మహిళ విషయంలో చేసిన ఘన కార్యం దెబ్బకు గ్రాఫ్‌ పాతాలాన్ని తాకింది. రావెల కుమారుడి విషయంలో పార్టీకి చెడ్డ పేరు రాకుండా ఉండాలంటే రావెలపై కఠిన చర్యలు తీసుకోవాలని, వీలైతే మంత్రి వర్గం నుంచి బయటకు పంపించాలని సూచించారట కొందరు. కానీ చంద్రబాబు అలా చేయలేరని టీడీపీ సీనియర్ల భావన. ఎందుకంటే …

రావెల కుమారుడు మహిళలను వేధించడాన్ని కారణంగా చూపి మంత్రి రావెలపై చర్యలు తీసుకుంటే వెంటనే చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్ తెరపైకి వస్తుందని చెబుతున్నారు. తహసీల్దార్ వనజాక్షిని ఇసుకలో పడేసి కొట్టినా ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోలేదని ఇప్పుడు కొడుకు చేసిన పనికి రావెలపై చర్యలు తీసుకుంటే సీన్ రివర్స్ అవుతుందంటున్నారు. సొంత సామాజికవర్గం విషయంలో ఒకలా, దళిత నేతల విషయంలో మరోలా వ్యవహరిస్తారా అన్న ప్రశ్న తలెత్తుతుందంటున్నారు. దానికి సమాధానం చెప్పుకోవడం సాధ్యమయ్యే పనికాదంటున్నారు.

ఒకవేళ రాజధానిలో అసైన్డ్ భూములు కొన్నారన్న ఆరోపణపై వేటు వేద్దామా అంటే … అక్కడ వందల ఎకరాలు కొన్న మిగిలిన టీడీపీ మంత్రుల సంగతేంటి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అందుకే రావెల విషయంలో ఏమీ చేయలేని సిస్సహాయతలో చంద్రబాబు ఉన్నట్టు చెబుతున్నారు. ఒకవిధంగా చింతమనేని ఎపిసోడ్, రాజధానిలో మిగిలిన మంత్రులు భారీగా భూములు కొనడం వంటి అంశాలు ఇప్పుడు రావెల పదవికి ఎలాంటి ఆపద లేకుండా చేస్తున్నాయని చెబుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News