పాపం గవర్నర్… ఆయనకు ఏ పాపం తెలియదు!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సభ మొదలైంది. ప్రభుత్వం చేసిన, చేయబోతున్న కార్యక్రమాలను గవర్నర్ వివరించారు. మాటల వరకు మాత్రం ప్రసంగం భలేగా అనిపించింది. కానీ అవన్నీ వాస్తవాలవడమే అనుమానం. గవర్నర్‌ ప్రసంగంలో ఏం చెప్పారంటే… మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ ద్వారా చెప్పించింది.   మరి తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోగలిగారా?.  ”అమ్మాయిలు పిలిస్తే వెళ్లి  కడుపు చేసేయడమే” అని సెలవిచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణపై ఏం […]

Advertisement
Update:2016-03-05 10:48 IST

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగంతో సభ మొదలైంది. ప్రభుత్వం చేసిన, చేయబోతున్న కార్యక్రమాలను గవర్నర్ వివరించారు. మాటల వరకు మాత్రం ప్రసంగం భలేగా అనిపించింది. కానీ అవన్నీ వాస్తవాలవడమే అనుమానం. గవర్నర్‌ ప్రసంగంలో ఏం చెప్పారంటే…

మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు ప్రభుత్వం గవర్నర్ ద్వారా చెప్పించింది. మరి తహసీల్దార్ వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోగలిగారా?. ”అమ్మాయిలు పిలిస్తే వెళ్లి కడుపు చేసేయడమే” అని సెలవిచ్చిన ఎమ్మెల్యే బాలకృష్ణపై ఏం చర్యలు తీసుకుంటారో?. నడిరోడ్డుపై మహిళను కారులోకి లాగబోయి నిర్భయ కేసులో బుక్ అయిన మంత్రి రావెల తనయుడి విషయంలో ఏం చర్యలు తీసుకుంటారో చెప్పి ఉంటే గవర్నర్ ప్రసంగానికి ఇంకా వెయిట్ వచ్చి ఉండేది.

2018 నాటికి పోలవరం తొలి దశ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అయితే ప్రాజెక్ట్ నిర్మాణ అంచనా వ్యయం 32 వేల కోట్లు. కానీ కేంద్రం కేటాయించింది వంద కోట్లు. ఇలాగైతే 2018కి పోలవరం పూర్తవుతుందంటే నమ్మడం సాధ్యమా?. పెన్నా, కృష్ణానదులను అనుసంధానం చేస్తామన్నారు. పట్టిసీమే ఇంకా పూర్తికాలేదు. ఇక పెన్నమ్మకు, కృష్ణమ్మకు లింక్ కలపడం ఇప్పట్లో సాధ్యమా?

కాపులను బీసీల్లో చేర్చేందుకు కట్టుబడి ఉన్నామన్నారు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. వచ్చే ఏడాది నుంచి కాపు కార్పొరేషన్‌కు వెయ్యి కోట్లు కేటాయిస్తామన్నారు. కానీ ఈ ఏడాది కాపు కార్పొరేషన్‌కు ఎంత కేటాయించారన్నది మాత్రం సృష్టంగా చెప్పలేదు. బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రానికి రెకమెండ్ చేస్తామన్నారే గానీ ఎప్పటి లోపల బోయలు ఎస్టీల్లో చేరుతారన్న దానిపై నో క్లారిటీ.

ఇక రాష్ట్రంలో పత్రి ఇంటికి నెలకు కేవలం రూ. 150లకే 15 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్ నెట్‌, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తారట. స్టేట్‌లో పల్లెలు తాగేందుకు నీరు లేక అలమటిస్తున్న ప్రస్తుత పరిస్థితిలో ముందుగా ఇంటింటికి మంచినీరు ఇస్తే బాగుంటుంది.

2019-20 నాటికి సంపూర్ణ అక్షరాస్యత ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. వచ్చే ఏడాది వృద్ధి రేటు 15 శాతం ఉంటుందని ప్రభుత్వం తరపున గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. ఈ అంకెల్లో రంకెలేసే అభివృద్ధి అంతా ఒక మాయజాలం అని తెలియనిది ఎవరికి? . రాష్ట్రంలో నాలుగు లక్షల ఇళ్లు మంజూరు చేసేశా మన్నారు. అవి ఎక్కడ మంజూరయ్యాయో?. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ప్రతి ఇంటికి రోజూ 20 లీటర్ల తాగు నీరు అందిస్తామని చెప్పారు. ఇది ఎన్నికల మెనిఫెస్టోలో చెప్పిన విషయమే. ఆ పథకాన్ని ప్రారంభించడం, అట్టర్ ప్లాప్ కావడం రెండూ జరిగిపోయాయి. ఇక కొత్తగా చేసేదేముంది.

ఇలా గవర్నర్ ప్రసంగంలో జనాన్ని ఆశలతో ఊర్రూతలూగించారు. అయితే గవర్నర్‌కు ఈ విషయంలో ఏం పాపం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం రాసిచ్చిన పేపర్లను చదవడం మాత్రమే మన నిబంధనల ప్రకారం గవర్నర్ విధి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే అశాస్త్రీయంగా జరిగిన రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని గవర్నర్ చెప్పారు. త్వరలో ప్రారంభం కాబోయే తెలంగాణ అసెంబ్లీలో ఇందుకు పూర్తి భిన్నంగా రాష్ట్ర విభజనకు అనుకూలంగా గవర్నర్ ప్రసంగించాల్సి ఉంటుంది. గత ఏడాది కూడా గవర్నర్‌కు ఇదే ఇబ్బంది ఏర్పడింది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News