భూమా మాటను అనుచరులే లెక్కచేయడం లేదా?
కార్యకర్తలు, అనుచరుల సూచన మేరకే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరినట్టు భూమానాగిరెడ్డి అప్పట్లో చెప్పారు. కానీ ఆయన తరహాలోనే పదేపదే పార్టీ మారేందుకు కింది స్థాయి నాయకులు సిద్ధపడడం లేదని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. టీడీపీలో మంత్రి పదవి ఆశిస్తున్నఆయన ఇప్పుడు తన అనుచరులే మాట వినకపోయే సరికి ఇబ్బంది పడుతున్నారట. నంద్యాల వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా భూమా ఆహ్వానించగా ఆయన తిరస్కరించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని వైసీపీలోనే […]
కార్యకర్తలు, అనుచరుల సూచన మేరకే తాను వైసీపీని వీడి టీడీపీలో చేరినట్టు భూమానాగిరెడ్డి అప్పట్లో చెప్పారు. కానీ ఆయన తరహాలోనే పదేపదే పార్టీ మారేందుకు కింది స్థాయి నాయకులు సిద్ధపడడం లేదని పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. టీడీపీలో మంత్రి పదవి ఆశిస్తున్నఆయన ఇప్పుడు తన అనుచరులే మాట వినకపోయే సరికి ఇబ్బంది పడుతున్నారట. నంద్యాల వైస్ చైర్మన్ డాక్టర్ రామలింగారెడ్డిని టీడీపీలోకి రావాల్సిందిగా భూమా ఆహ్వానించగా ఆయన తిరస్కరించారు. తాను పార్టీలు మారే వ్యక్తిని కాదని వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారని కథనం.
ఎవరో పార్టీ మారితే తాను కూడా పార్టీ మారాలన్న నిబంధన ఏమైనా ఉందా అని రామలింగారెడ్డి తన అనుచురుల వద్ద ఘాటుగా వ్యాఖ్యానించారట. నియోజకవర్గంలో కీలకమైన ఉయ్యాలవాడ, చాగలమర్రి, శిరివెళ్ల మండలాల్లో భూమాకు ఈ తరహా ఎదురుగాలి వీస్తోందట.
టీడీపీ నుంచి పీఆర్పీలోకి వెళ్లారు… పీఆర్పీ ఓడిపోగానే వైఎస్‌కు దగ్గరయ్యారు. అక్కడి నుంచి వైసీపీలో చేరారు. ఇప్పుడు తిరిగి టీడీపీలో చేరారు. ఇలా కనీసం ఒకపార్టీలో ఐదేళ్లు కూడా లేకుండా పార్టీలు మారుతూ ఉంటే అసలు విలువేముంటుందని కింద స్థాయి నాయకులే వాపోతున్నారు. అందుకే తాను వైసీపీని వీడబోమని… పార్టీ అధినాయకత్వం ఎవరో ఒకరికి నాయకత్వం అప్పగిస్తే కలిసి పనిచేసుకుంటామని చెబుతున్నారు. ఎన్నికలు సమీపించే వేళకు బలమైన నాయకత్వమే వస్తుందని అంచనాలు వేసుకుంటున్నారు. చూస్తుంటే అనుచరుల వద్ద కూడా భూమా క్రెడిబులిటీ పొగొట్టుకున్నట్టు అనిపిస్తోంది. ఇలా పదేపదే గోడలు దూకితే ఇలాగే ఉంటుంది.
Click on image to read: