అప్పుల మంత్రి సుజనాకి సుప్రీంలో చుక్కెదురు

కేంద్రమంత్రి సుజనాచౌదరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిషస్ బ్యాంకు రుణం కేసులో సుజనా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ కంపెనీతో తనకు సంబంధం లేదని… తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలన్న సుజనా పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.  సుజనా చౌదరి తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో లేనందున.. ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను […]

Advertisement
Update:2016-03-04 08:38 IST

కేంద్రమంత్రి సుజనాచౌదరికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. మారిషస్ బ్యాంకు రుణం కేసులో సుజనా దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మారిషస్ బ్యాంకు నుంచి రుణం తీసుకున్న సుజనా యూనివర్శల్ ఇండస్ట్రీస్ కంపెనీతో తనకు సంబంధం లేదని… తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలన్న సుజనా పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది.

సుజనా చౌదరి తమ నుంచి తీసుకున్న రూ.106 కోట్ల అప్పును చెల్లించే స్థితిలో లేనందున.. ఆయనకు చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌ను మూసివేసి, దాని ఆస్తులను అమ్మి, తద్వారా తమ అప్పును తీర్చేలా ఆదేశాలివ్వాలంటూ మారిషస్‌కు చెందిన మారిషస్ కమర్షియల్ బ్యాంక్ (ఎంసీబీ) ఇటీవల హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీంతో తదుపరి చర్యలు తనపై ఉండకుండా చూసుకునేందుకు సుజనా సుప్రీంకు వెళ్లారు. లోన్ తీసుకున్న కంపెనీల నుంచి తాను ఎప్పుడో బయటకు వచ్చానని అలాంటప్పుడు తానెలా బాధ్యుడనవుతానని ఆయన వాదన. కానీ ఈ వాదనలో సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. సుజనా పిటిషన్ కొట్టేయడమే కాకుండా ఆరు నెలల గడువును ఐదు నెలలకు కుదించింది.

సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కం పెనీని హేస్టియా పేరుతో మారిషస్‌లో ఏర్పాటు చేసింది. 2010లో ఎంసీబీ నుంచి రూ.100 కోట్ల మేర రుణం తీసుకుంది. ఇందుకు సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా ఉంది. అయితే 2012 నుంచీ హేస్టియా బకాయి చెల్లిం పులు మానేసింది. దీంతో బ్యాంకు హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించింది. కానీ విచారణలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఆస్తుల జప్తుకు అనుమతివ్వాలంటూ గతేడాది హైకోర్టును ఆశ్రయించింది బ్యాంకు. మొత్తం మీద చూస్తుంటే సుజనా చౌదరికి తిప్పలు తప్పేలా లేవు. అయినా ఇలాంటి వారు కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా కొనసాగడంపైనా విమర్శలు వస్తున్నాయి. నిజాయితీగా ప్రభుత్వాన్ని నడుపుతామని చెప్పే మోదీ… సుజనా చౌదరిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News