కళ్లు పీకడం అంటే ఇదేనా సార్‌!

”తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎవడైనా అమ్మాయిల వైపు కన్నేత్తి చూస్తే కళ్లు పీకేస్తా”. ఇది కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో పోకిరీలకు ఇచ్చిన వార్నింగ్ . ఒక ముఖ్యమంత్రి అలా కళ్లు పీకుతానని అనవచ్చా అని కొందరు ఈకలు పీకే పనిచేసినా… సాధారణ జనం, అమ్మాయిలు ఒక హీరోలా కేసీఆర్‌ను చూశారు.  కేసీఆర్‌ మాటలకు మద్దతు పలికారు. అందుకు తగ్గట్టుగానే షీ టీమ్స్‌ పెట్టి హైదరాబాద్‌ లో పోకిరీల ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తూ అందరి మన్ననలు పొందారు. కానీ […]

Advertisement
Update:2016-03-04 04:56 IST

”తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎవడైనా అమ్మాయిల వైపు కన్నేత్తి చూస్తే కళ్లు పీకేస్తా”. ఇది కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో పోకిరీలకు ఇచ్చిన వార్నింగ్ . ఒక ముఖ్యమంత్రి అలా కళ్లు పీకుతానని అనవచ్చా అని కొందరు ఈకలు పీకే పనిచేసినా… సాధారణ జనం, అమ్మాయిలు ఒక హీరోలా కేసీఆర్‌ను చూశారు. కేసీఆర్‌ మాటలకు మద్దతు పలికారు. అందుకు తగ్గట్టుగానే షీ టీమ్స్‌ పెట్టి హైదరాబాద్‌ లో పోకిరీల ఆటకట్టించేందుకు ప్రయత్నిస్తూ అందరి మన్ననలు పొందారు. కానీ టీడీపీ ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు విషయంలో హైదరాబాద్‌ పోలీసుల తీరుతో మరోసారి అనుమానాలు చెలరేగాయి.

కేసీఆర్ కళ్లు పీకేస్తా అన్న మాటలు దిక్కుమొక్కు లేని పోకిరీలకు మాత్రమే వర్తిస్తాయా?. మంత్రుల కుమారులకు కళ్లు పీకుడు శిక్ష వర్తించదా?. బైక్‌లో వెళ్తూ అమ్మాయిలను వేధించిన వారు మాత్రమే పోకిరీల కిందకు వస్తారా?. పెద్దపెద్ద కార్లలో వచ్చి ఏకంగా మహిళలను కార్లలోకి లాగేందుకు ప్రయత్నిస్తే వారు పోకిరీలు కాకుండా పోటుగాళ్లు అవుతారా?. రావెల సుశీల్ ఒక మహిళా టీచర్‌ను లాగిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. అంటే దాదాపు రెండు రోజులవుతోంది. కానీ ఇప్పటి వరకు సుశీల్‌పై కేసు లేదు. సరే ఘటన ఎలా జరిగిందో అని ఇంకా విచారణ జరుపుతున్నారే అనుకుందాం!.

అప్పుడు సుశీల్ కారు డ్రైవర్‌పైన కూడా కేసు పెట్టకూడదు కదా?. కానీ కారు డ్రైవర్‌పై కేసు పెట్టిన పోలీసులు మంత్రి కుమారుడిని ఎందుకు వదిలేసినట్టు?. బాధితురాలే స్వయంగా వచ్చి మంత్రి కుమారుడిని గుర్తు పట్టి అతడే తనను చేయి పట్టి లాగాడని వాపోతున్నా … రెండు రోజులు గడుస్తున్నా కేసు నమోదు కాలేదంటే ఏమనాలి?. పైగా మంత్రి కుమారుడిపైనే దాడి చేశారంటూ ఎదురు కేసుకు సిద్ధపడుతుంటే ఏమనాలి?. అంటే భవిష్యత్తులో మరో మంత్రి కుమారుడు దారిన పోయే మహిళలను చీర లాగితే అక్కడున్న స్థానికులెవరూ ప్రతిఘటించకుండా చేయాలన్నది పోలీసుల ఉద్దేశమా?.

దాడి నుంచి మహిళను రక్షించాల్సిన వారిని అభినందించాల్సింది పోయి వారిపైనే కేసుకు సిద్ధమవడం అంటే పెద్దోళ్లు పెద్దోళ్లు ఒకటే అని చాటాలనుకుంటున్నారా?. ఇలా మహిళలపై దాడి చేసిన వారిని రక్షించాల్సిందిగా కేసీఆర్‌ గానీ, ఆయన కుటుంబసభ్యులు గానీ పోలీసులను చెప్పి ఉంటారని ఎవరూ అనుకోరు. కానీ ఘటన జరిగింది. హైదరాబాద్‌లో కాబట్టి కీచకుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సింది తెలంగాణ పోలీసులే. అలా పోలీసులు పనిచేసేలా చూడాల్సింది తెలంగాణ ప్రభుత్వ పెద్దలే. కళ్లు పీకాల్సిన అవసరం లేదు. ఇలాంటివారిపై కేసులు పెట్టించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటే చాలు. మహిళను చేయి పట్టుకుని కారులోకి లాగబోయిన ఏపీ టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్‌కు ఉచ్చు బిగుసుకుంది. అతడిపై ఎట్టకేలకు నిర్భయ కేసును నమోదు చేశారు. బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఈ కేసు నమోదైంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News