రావెల …! బిగుసుకుంటున్న ఉచ్చు, రంగంలోకి కేకే కూతురు

మహిళను చేయి పట్టుకుని కారులోకి లాగబోయిన ఏపీ టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు  రావెల సుశీల్‌కు ఉచ్చు బిగుసుకుంది. అతడిపై ఎట్టకేలకు నిర్భయ కేసును నమోదు చేశారు. బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఈ కేసు నమోదైంది. గురువారం సాయంత్రం ఒక ముస్లిం మహిళకు కారు అడ్డుపెట్టి సుశీల్ లోనికి లాగబోయాడు. ఈ సమయంలో అక్కడున్న స్థానికులు అప్రమత్తమవడంతో ఆమె బయటపడ్డారు.  సుశీల్‌తో పాటు అతడి కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. తొలుత డ్రైవర్‌పై మాత్రమే కేసు నమోదు […]

Advertisement
Update:2016-03-04 07:44 IST

మహిళను చేయి పట్టుకుని కారులోకి లాగబోయిన ఏపీ టీడీపీ మంత్రి రావెల కిషోర్ బాబు కుమారుడు రావెల సుశీల్‌కు ఉచ్చు బిగుసుకుంది. అతడిపై ఎట్టకేలకు నిర్భయ కేసును నమోదు చేశారు. బంజారాహిల్స్‌ పీఎస్‌లో ఈ కేసు నమోదైంది. గురువారం సాయంత్రం ఒక ముస్లిం మహిళకు కారు అడ్డుపెట్టి సుశీల్ లోనికి లాగబోయాడు. ఈ సమయంలో అక్కడున్న స్థానికులు అప్రమత్తమవడంతో ఆమె బయటపడ్డారు. సుశీల్‌తో పాటు అతడి కారు డ్రైవర్‌ను స్థానికులు చితకబాదారు. తొలుత డ్రైవర్‌పై మాత్రమే కేసు నమోదు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం జరిగింది. అయితే ఈ విషయం మీడియాలో పెద్దెత్తున కథనాలు రావడంతో పోలీసులు దిగివచ్చారు. సుశీల్‌పై నిర్భయ కేసు నమోదు చేశారు.

మరోవైపు బాధితురాలికి అండగా బంజారాహిల్స్ కార్పొరేటర్, ఎంపీ కేకే కుమార్తె విజయలక్ష్మి నిలిచారు. కారు నడుపుతున్న డ్రైవర్ అప్పారావు మహిళ చేయి ఎలా లాగగలరని ప్రశ్నించారు. బాధితురాలికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని, సమయానికి భర్త రావడంతో ఆమె గండం నుంచి బయటపడగలిగారని చెప్పారు. ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారులో ప్రయాణిస్తూ ఓ మహిళ చేయి పట్టుకుని లాగాడంటే అంతకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. రావెల సుశీల్‌ను కఠినంగా శిక్షించాల్సిందేనని డిమాండ్ చేశారు. బాధితురాలిని తీసుకుని ఆమె శనివారం బంజారాహిల్స్ పీఎస్‌కు వచ్చారు.

Click on image to read:

 

 

 

 

Tags:    
Advertisement

Similar News