ఆ నిద్రా భంగిమ అందానికి చేటు!
మనం నిద్రపోయే భంగిమ మన అందంమీద ప్రభావాన్ని చూపుతుందట. కొన్ని నిద్రాభంగిమలు మన మొహంలో ముడతలు సృష్టించి త్వరగా వయసు కనిపించేలా చేస్తాయంటున్నారు సౌందర్యనిపుణులు. అందుకే నిద్ర విషయంలో ఈ జాగ్రత్తలు పాటించితీరాలి- మేకప్ తొలగించకుండా నిద్రపోతే తెల్లారే సరికి కళ్లకింద వాపులు కనబడతాయి. అలాగే మనం నిద్రించే భంగిమని బట్టి కూడా కళ్లకింద వాపు, ఉబ్బటం ఉంటుంది. దుప్పట్లు, దిండ్ల తాలూకూ ముద్రలు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ మొహంమీద మరింత ఎక్కువగా కనబడుతుంటాయి. వెల్లకిలా, […]
మనం నిద్రపోయే భంగిమ మన అందంమీద ప్రభావాన్ని చూపుతుందట. కొన్ని నిద్రాభంగిమలు మన మొహంలో ముడతలు సృష్టించి త్వరగా వయసు కనిపించేలా చేస్తాయంటున్నారు సౌందర్యనిపుణులు. అందుకే నిద్ర విషయంలో ఈ జాగ్రత్తలు పాటించితీరాలి-
మేకప్ తొలగించకుండా నిద్రపోతే తెల్లారే సరికి కళ్లకింద వాపులు కనబడతాయి. అలాగే మనం నిద్రించే భంగిమని బట్టి కూడా కళ్లకింద వాపు, ఉబ్బటం ఉంటుంది. దుప్పట్లు, దిండ్ల తాలూకూ ముద్రలు కూడా వయసు పెరుగుతున్న కొద్దీ మొహంమీద మరింత ఎక్కువగా కనబడుతుంటాయి.
వెల్లకిలా, తల పైకి చూసేలా కాకుండా తలని దిండుకి అదుముతూ నిద్రపోయినా, లేదా పక్కకి తిరిగి పడుకున్నా అందానికి సంబందించిన సమస్యలు వస్తాయని కాస్మటిక్ వైద్య నిపుణులు చెబుతున్నారు. తలకిందికి ఉంటే మొహంలోకి శరీరంలోని ద్రవాలు వచ్చిచేరే అవకాశం ఉంటుంది. అందుకే నిద్రపోయి లేచాక మొహం ఉబ్బినట్టుగా కనబడుతుంది. అలాగే ఒక పక్కకి తిరిగి పడుకున్నా ఈ సమస్య ఉంటుంది, వెల్లకిలా పడుకుంటే ఈ సమస్య కాస్త తగ్గుతుంది.
అందుకే బ్రిటీష్ నిద్రా నిపుణులు మీరు ఎలా నిద్రిస్తున్నారు అనేది మీ వయసుని చెబుతుంది అంటారు. అలాగే అమెరికన్ ఎకాడమీ ఆఫ్ డెర్మటాలజీ వెల్లకిలా నిద్రపోతేనే ముఖంలో వయసు కనబడకుండా ఉంటుంది అని చెబుతోంది.
తలని దిండుకి ఆన్చి, అది కూడా ఒకే పొజిషన్లో పడుకుంటూ ఉంటే మొహంమీద ముడతలు మరింత త్వరగా వస్తాయి. ముఖ్యంగా మహిళల్లో మెనోపాజ్ వయసు తరువాత ఒకే వైపుకి నిద్రపోయే అలవాటు ఉంటే వారిలో ముఖంమీద ఛాతీభాగంలో శాశ్వత ముడతలు పడిపోతాయని కాస్మటిక్ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పరుపులను కనీసం ఎనిమిదేళ్లకు ఒకసారి మార్చుతుండాలి. ఆ టైం దాటితే అవి మరింతగా పట్టుకోల్పోయి శరీరంలో నొప్పులకు, దురద లాంటి సమస్యలను కారణమవుతాయి. ఒక కొత్త పరుపు 45 నిముషాల అదనపు నిద్రని ఇస్తుంది.
ఒక్కరోజు నిద్రలేకపోయినా శరీరంలో ఒత్తిడి పేరుకుపోతుందట. ఒక అధ్యయనంలో ఇది నిరూపితమైంది. అలాగే ఎనిమిది గంటలు నిద్రపోయినా, అలారం పెట్టుకుని ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తే ఆ రోజంతా మత్తుగా గందరగోళంగానే ఉంటుందని, అలాకాకుండా నిదానంగా గాఢనిద్రనుండి కొంచెంకొంచెంగా మత్తుని వదులుతూ నిద్రలేస్తే రోజంతా హుషారుగా ఉంటారని సంబంధిత నిపుణులు చెబుతున్న మాట.