కాలక్షేపమా...అడిక్షనా...అదే ముఖ్యం!
అదేపనిగా ఫోన్లతో ఇంటర్‌నెట్‌తో గంటల కొద్దీ ఉంటున్న పిల్లలను చూసినపుడు చాలా మంది తల్లిదండ్రులకు భయమనిపిస్తుంది. వీళ్లని ఇందులోంచి ఎలా బయటకు తేవాలి అని వారు మదనపడుతుంటారు. అయితే ఈ టెక్నాలజీ వాడకం అందరిపై ఒకేరకమైన ప్రభావాన్ని చూపదంటున్నారు ఇల్లినాయిస్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్ అలెజాండ్రో లెరాస్. మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్ యువతరంలో డిప్రెషన్‌ని తెచ్చిపెడతాయని ఒక అద్యయనంలో నిరూపితమైంది. అయినా అందరికీ అలాంటి సమస్య రాకపోవచ్చని లెరాస్ అంటున్నారు. ఇది తెలవాలంటే మీ పిల్లలు ఎలాంటివారు, […]
అదేపనిగా ఫోన్లతో ఇంటర్‌నెట్‌తో గంటల కొద్దీ ఉంటున్న పిల్లలను చూసినపుడు చాలా మంది తల్లిదండ్రులకు భయమనిపిస్తుంది. వీళ్లని ఇందులోంచి ఎలా బయటకు తేవాలి అని వారు మదనపడుతుంటారు. అయితే ఈ టెక్నాలజీ వాడకం అందరిపై ఒకేరకమైన ప్రభావాన్ని చూపదంటున్నారు ఇల్లినాయిస్ యూనివర్శిటీ సైకాలజీ ప్రొఫెసర్ అలెజాండ్రో లెరాస్.
మొబైల్ ఫోన్లు, ఇంటర్‌నెట్ యువతరంలో డిప్రెషన్‌ని తెచ్చిపెడతాయని ఒక అద్యయనంలో నిరూపితమైంది. అయినా అందరికీ అలాంటి సమస్య రాకపోవచ్చని లెరాస్ అంటున్నారు. ఇది తెలవాలంటే మీ పిల్లలు ఎలాంటివారు, వారి గుణగణాలు ఎలాంటివి అనేది తెలియాలని ఈ సైకాలజీ ప్రొఫెసర్ చెబుతున్నారు.
దేనికైనా బానిసైపోయే గుణం, తమకి తాము హాని చేసుకునే లక్షణం ఉన్నవారిపై ఇంటర్‌నెట్, మొబైల్ ఫోన్ల ప్రభావం ఎలా ఉంటుంది…అనే అంశంపై ఈ ప్రొఫెసర్ ఒక అద్యయనం నిర్వహించారు. ఇలాంటి గుణాలున్నవారు టెక్నాలజీకి బానిసలై పోతున్నారని, వీరిలో ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనబడుతున్నాయని లెరాస్ కనుగొన్నారు. అయితే కాలక్షేపం కోసం, బోర్‌నుండి తప్పించుకోవడానికి మాత్రమే వీటిని వాడేవారు మాత్రం మానసికంగా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవడం లేదని ఈ అధ్యయనంలో తేలింది. అలా కాకుండా వాటిని వినియోగించకపోతే తట్టుకోలేని స్థితిలోకి వెళ్లినవారిలో మాత్రం డిప్రెషన్ లక్షణాలు కనబడుతున్నాయని ఆయన అన్నారు. టెక్నాలజీని ఎందుకు ఉపయోగిస్తున్నాం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని లెరాస్ అన్నారు.
అలాగే ఒత్తిడికి గురయిన సందర్భాల్లో ఫోన్ ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది అనే అంశం మీద కూడా అధ్యయనం నిర్వహించారు. ఒత్తిడి పెరిగిపోయే సందర్భాల్లో ఉన్నపుడు సెల్ ఫోన్ దగ్గర ఉన్నవారు, ఫోన్ లేనివారికంటే ప్రశాంతంగా ఉండటం, ఒత్తిడి ప్రభావం వారిపై ఎక్కువ లేకపోవడం గమనించారు. ఫోన్ దగ్గర ఉంటే కాల్ చేయకపోయినా ఆందోళన, కంగారు లాంటివి తగ్గడం కనిపించింది.