ఏం బోండా… ఇప్పుడు పౌరుషం వచ్చిందా!

కాపు ఉద్యమం చేస్తున్న ముద్రగడతో పాటు వర్గీకరణ కోసం పోరాటానికి సిద్ధమవుతున్న మందకృష్ణ వెనుక జగన్ హస్తముందని టీడీపీ నేతలు ఆరోపించడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు.  కాపులపైకి కాపు నేతలను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. నిమ్మరసం ఇచ్చి ముద్రగడ చేత దీక్ష విరమించిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే తిరిగి ముద్రగడ ఎందుకు దీక్షకు దిగుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట తప్పారు కాబట్టే ముద్రగడ మళ్లీ దీక్షకు సిద్ధమవుతున్నారని […]

Advertisement
Update:2016-03-04 10:58 IST

కాపు ఉద్యమం చేస్తున్న ముద్రగడతో పాటు వర్గీకరణ కోసం పోరాటానికి సిద్ధమవుతున్న మందకృష్ణ వెనుక జగన్ హస్తముందని టీడీపీ నేతలు ఆరోపించడంపై వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. కాపులపైకి కాపు నేతలను చంద్రబాబు ఉసిగొల్పుతున్నారని విమర్శించారు. నిమ్మరసం ఇచ్చి ముద్రగడ చేత దీక్ష విరమించిన సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉంటే తిరిగి ముద్రగడ ఎందుకు దీక్షకు దిగుతారని ప్రశ్నించారు. చంద్రబాబు మాట తప్పారు కాబట్టే ముద్రగడ మళ్లీ దీక్షకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఇందులో జగన్‌ ప్రమేయం ఎలా ఉంటుందని అంబటి ప్రశ్నించారు. తునిలో రైలు తగలబెట్టినప్పుడు కడప నుంచి వచ్చిన రౌడీలే ఈ పనిచేశారని చంద్రబాబు స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. మరి రైలు తగలబెట్టిన వారిని ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. పైగా కాపులు మంచివాళ్లు అంటూనే కాపులపై కేసులు పెట్టిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ఎందుకు నిత్యం ముద్రగడపై టీడీపీ ఎమ్మెల్యేలు బోండా ఉమ, బుడేటి బుజ్జిలు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. ”ముఖ్యమంత్రినైన నన్ను విమర్శిస్తుంటే ఎందుకు ఎదురుదాడి చేయడం లేదు… మీకు బుద్దిలేదా” అని కాపు మంత్రులను చంద్రబాబు తిట్టిన మాట వాస్తవం కాదా అని అన్నారు. దరిద్రంలో కొట్టుమిట్టాడుతున్న కాపుజాతిని బీసీల్లో చేర్చాలని ముద్రగడ కోరితే… కాపు జాతిని దరిద్ర జాతి అన్నందుకు క్షమాపణ చెప్పాలంటూ ముద్రగడను బొండా ఉమ నిలదీయడం ఎంతవరకు సమంజసమన్నారు. కాపులను దరిద్రపు జాతి అన్నందుకు కోపగించుకుంటున్న బొండా ఉమ… ఇదే ముఖ్యమంత్రి ఎస్సీలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బోండా ఉమకు ఇప్పుడు పౌరుషం వచ్చిందా అని ప్రశ్నించారు.

రిజర్వేషన్ల పేరుతో కాపులను, వర్గీకరణపేరుతో ఎస్సీలను రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు సిగ్గులజ్జ ఉంటే భార్య చేత అసైన్డ్ భూములను కొనిపించిన రావెల కిషోర్ బాబును కేబినెట్ నుంచి ఎందుకు తొలగించలేదో చెప్పాలన్నారు. రావెలను తొలగిస్తే మిగిలిన నేతల బండారం మొత్తం బయటపడుతుందని భయమా అని అన్నారు. ఏదో అనుభవం ఉందని అధికారం కట్టబెడితే చీకటి వ్యాపారాలు చేయించడం ఏమిటన్నారు. ఇలా చట్టాలను విశృంఖలంగా ఉల్లఘిస్తున్న ముఖ్యమంత్రి మరొకరు ఉండరన్నారు. లింగమనేని బంగ్లాతో పాటు కరకట్టపై అక్రమంగా నిర్మించిన భవనాలన్నింటిని కూల్చేస్తామన్న దేవినేని ఉమ ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నించారు. లింగమనేని భవనంలో సీఎం కునుకు తీస్తున్నారు కాబట్టి అప్పుడా భవనం సక్రమం అయిపోయిందా అని నిలదీశారు అంబటి.

Click on image to read:


Tags:    
Advertisement

Similar News