బాబు ఎత్తుకు బిత్తరపోయిన శత్రుచర్ల వర్గం

చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌ దెబ్బకు టీడీపీ పాత నేతలు కంగుతింటున్నారు. ఇప్పటికే ఆదినారాయణరెడ్డి, భూమా నాగిరెడ్డి చేరికతో ఆయా నియోజకవర్గాల్లో లుకలుకలు బయలు దేరాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే వెంకటరమణ టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు టీడీపీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆలోచనలో పడ్డారు.  శత్రుచర్లతో పాటు టీడీపీని నమ్ముకుని ఎంతోకాలంగా పనిచేస్తున్న స్థానిక నేతలు కూడా వైసీపీ  ఎమ్మెల్యే రాకపై ఆగ్రహంగా […]

Advertisement
Update:2016-03-01 19:51 IST

చంద్రబాబు ఆపరేషన్ ఆకర్ష్‌ దెబ్బకు టీడీపీ పాత నేతలు కంగుతింటున్నారు. ఇప్పటికే ఆదినారాయణరెడ్డి, భూమా నాగిరెడ్డి చేరికతో ఆయా నియోజకవర్గాల్లో లుకలుకలు బయలు దేరాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వైసీపీ ఎమ్మెల్యే వెంకటరమణ టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు టీడీపీ పాతపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు ఆలోచనలో పడ్డారు. శత్రుచర్లతో పాటు టీడీపీని నమ్ముకుని ఎంతోకాలంగా పనిచేస్తున్న స్థానిక నేతలు కూడా వైసీపీ ఎమ్మెల్యే రాకపై ఆగ్రహంగా ఉన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారుతున్నట్టు వెంకటరమణ చెబుతున్న మాటలను వారు విశ్వసించడం లేదు. గెలిచిన రెండేళ్ల తర్వాత నియోజకవర్గ అభివృద్ది గుర్తుకొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు.

వెంకటరమణను పార్టీలోకి తీసుకురావడం వెనుక మంత్రి అచ్చెన్నాయుడి హస్తముందని మరో వర్గం భావిస్తోంది. శత్రుచర్ల కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినప్పుడే అచ్చెన్నాయుడు వ్యతిరేకించారని చెబుతున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్నప్పటికీ శత్రుచర్లను అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే వెంకటరమణను పార్టీలోకి తీసుకురావడం ద్వారా శత్రుచర్లకు పూర్తి స్థాయిలో చెక్‌ పెట్టినట్టుగా భావిస్తున్నారు. స్వయంగా ఎమ్మెల్యేనే పార్టీలోకి వచ్చాక ఇక ఇన్‌చార్జ్‌కు విలువ ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. శత్రుచర్ల ఇప్పటికిప్పుడు తిరుగుబాటు బావుట ఎగురవేసే అవకాశం లేకపోయినా భవిష్యత్తులో ఆయన ఏదో ఒక దారి చూసుకోకతప్పని పరిస్థితిని సొంత పార్టీ నేతలే సృష్టిస్తున్నారని ఆయన వర్గం ఆందోళన చెందుతోంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News