ఇప్పటికి జ్ఞానోదయం అయినట్టుంది!

సాక్షి. ఈ మీడియా సంస్థపై తొలి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటి వరకు టీడీపీ అనుకూలపత్రికలిచ్చే వార్తలనే చదివి సర్దుకుపోయిన.. యాంటీ టీడీపీ వర్గాలకు సాక్షి ఒక పెద్ద ఓదార్పు అయింది.  కానీ ఈ మధ్య కాలంలో సాక్షిపై యాంటీ టీడీపీ వర్గాలు ఆ పత్రికపై అంచనాలు తగ్గించుకున్నాయి. సాధారణ  వార్తలు తప్పించి ప్రభుత్వాన్ని నిలదీయడంలో అనుకున్నంత స్థాయిలో వార్తలు రాయలేకపోతోంది.  పైగా తమది తటస్థంగా ఉండే పత్రిక అని కలర్ ఇచ్చేందుకు ప్రయత్నించడంతో అటుఇటు […]

Advertisement
Update:2016-03-02 05:16 IST

సాక్షి. ఈ మీడియా సంస్థపై తొలి నుంచి కూడా భారీ అంచనాలు ఉన్నాయి. అప్పటి వరకు టీడీపీ అనుకూలపత్రికలిచ్చే వార్తలనే చదివి సర్దుకుపోయిన.. యాంటీ టీడీపీ వర్గాలకు సాక్షి ఒక పెద్ద ఓదార్పు అయింది. కానీ ఈ మధ్య కాలంలో సాక్షిపై యాంటీ టీడీపీ వర్గాలు ఆ పత్రికపై అంచనాలు తగ్గించుకున్నాయి. సాధారణ వార్తలు తప్పించి ప్రభుత్వాన్ని నిలదీయడంలో అనుకున్నంత స్థాయిలో వార్తలు రాయలేకపోతోంది. పైగా తమది తటస్థంగా ఉండే పత్రిక అని కలర్ ఇచ్చేందుకు ప్రయత్నించడంతో అటుఇటు కాకుండా పోయింది. దాని ప్రభావం సర్క్యులేషన్ పైనా కనిపించింది. తటస్తంగా ఉంటే సాక్షి పత్రికను ఎక్కువ మంది చదువుతారని కొందరు చేసిన ప్రయోగమే ఇందుకు కారణమని చెబుతుంటారు. ఏపీ ప్రభుత్వం కావాల్సినన్ని తప్పులు చేస్తున్నా నామ్‌కే వాస్తి అన్నట్టుగా రాసి వదిలిపెట్టడం తప్పించి ఇటీవల కాలంలో సాక్షి పత్రిక గట్టిగా నిలదీసిన దాఖలాలు లేవు. ఫ్యామిలి పేజిల్లో ఇంటర్వ్యూలపై పెట్టిన శ్రద్ధ వార్తలపై పెట్టినట్టు కనిపించలేదు.

జగన్‌ అభిమానులు కొందరు స్వచ్చందంగా రీసెర్చ్ చేసి చంద్రబాబు తప్పులను సోషల్ మీడియాలో విపరీతంగా ఎండగడుతున్నారు. కానీ ఎంతో పెద్ద నెట్‌ వర్క్ ఉన్న సాక్షి కనీసం ఆ స్థాయిలో కూడా ఉపయోగపడడం లేదన్న భావన కూడా ఉంది.

అయితే చాలా కాలం తర్వాత ఇందుకు భిన్నంగా సాక్షి ఒక భారీ కథనాన్ని రాసింది. రాజధాని దురాక్రమణ అంటూ చంద్రబాబు, ఆయన బినామీలపై సంచలనాత్మక కథనం రాసింది. చాలాకాలం తర్వాత సాక్షి పేపర్ చదువుతుంటే ఆనందంగా అనిపించిందన్నది సగటు సాక్షి, యాంటీ టీడీపీ వర్గాల ఫీలింగ్. ఇలా తరచూ ఎందుకు రాయలేకపోతోందని ఫీల్ అవుతున్నారు. అయితే ఇన్నాళ్లకు జ్ఞానోదయం కావడానికి కారణం చంద్రబాబు వైఖరే అని తెలుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యేలను వరుసపెట్టి చంద్రబాబు సైకిల్ ఎక్కించుకుంటుండడంతో ఇక లాభం లేదన్న నిర్థారణకు సాక్షి వారు వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే చంద్రబాబు టీంపై యుద్ధాన్ని ప్రకటించారు. ఇప్పటికైనా తటస్థంగా ఉంటే సర్క్యులేష పెరుగుతుంది… అభిమానులు పెరుగుతారు వంటి చెప్పుడు మాటలు నమ్మకుండా సాక్షిని ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ ఉద్దేశంతోనే ముందుకెళ్తే బాగుంటుందని కోరుతున్నారు. టీడీపీ అనుకూల పత్రికలు ఏకపక్షంగా చంద్రబాబుకు అనుకూలంగా, జగన్‌కు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నప్పటికీ వాటి సర్కిలేషన్ పడిపోలేదు. మరి సాక్షి తటస్థం అనే ముసుగు తీసేసి చంద్రబాబు చేస్తున్న తప్పులను, వాస్తవాలను రాస్తూ పోతే సర్కిలేషన్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే టీడీపీని అభిమానించే వారు ఎంత మంది ఉన్నారో … చంద్రబాబు విధానాలను వ్యతిరేకించే వారు కూడా అదే స్థాయిలో ఉన్నారు. మరి వారందరినీ ఆకట్టుకునేలా కథనాలు రాయాలే గానీ… తటస్థం పేరుతో చంద్రబాబుకూ మధ్యమధ్యలో బాకా ఊదుతామంటే ఎవరైనా నమ్ముతారా?. అలాంటి ఐడియాను కొందరు పెద్దవాళ్లు ఇస్తుండవచ్చు.. కానీ ఆ ట్రాప్‌లో పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యంపైనే ఉంటుంది.

Click on image to read:

 

 

 

 

 

Tags:    
Advertisement

Similar News