వైసీపీ తాలు గింజలకు శీల పరీక్ష
ఏపీలో ఫిరాయింపు రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అన్ని శక్తులు వడ్డి బుట్టలో వేసుకుంటుండగా అందుకు ప్రతివ్యూహాలు రచించే పనిలో వైసీపీ ఉంది. తాజాగా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్న వైసీపీ నిర్ణయంపై చర్చ జరుగుతోంది. పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైనందుకే అవిశ్వాసం పెడుతున్నట్టు వైసీపీ చెబుతున్నా అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. వైసీపీకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోనే ఉన్న ముసుగు దొంగల పని పట్టేందుకే వైసీపీ అవిశ్వాసం ఎత్తుగడ […]
ఏపీలో ఫిరాయింపు రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీ అన్ని శక్తులు వడ్డి బుట్టలో వేసుకుంటుండగా అందుకు ప్రతివ్యూహాలు రచించే పనిలో వైసీపీ ఉంది. తాజాగా ప్రభుత్వంపై అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్న వైసీపీ నిర్ణయంపై చర్చ జరుగుతోంది. పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైనందుకే అవిశ్వాసం పెడుతున్నట్టు వైసీపీ చెబుతున్నా అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు. వైసీపీకి హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలతో పాటు పార్టీలోనే ఉన్న ముసుగు దొంగల పని పట్టేందుకే వైసీపీ అవిశ్వాసం ఎత్తుగడ వేసిందని చెబుతున్నారు.
అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే తమ వారు ఎవరో, కాని వారు ఎవరో సభలోనే తేలిపోతుందని వైసీపీ నాయకత్వం భావిస్తోంది. అవిశ్వాసం సమయంలో పార్టీ విప్ ధిక్కరించిన వారిపై ఆటోమెటిక్‌గా అనర్హత వేటు పడే అవకాశం ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల్లో విప్ జారీ చేసి ఫిరాయింపుదారుల పని పట్టాలని వైసీపీ భావించింది. కానీ రాజ్యసభ ఎన్నికల్లో రహస్య బ్యాలెట్ నిర్వహిస్తారని టీడీపీ నేతలు గట్టిగా వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాల సమయంలోనే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తాలు గింజలను ఏరిపారేయాలని వైసీపీ నాయకత్వం భావిస్తోందట. ఈ ఎత్తు ఎంతవరకు సఫలం అవుతుందో త్వరలోనే తేలుతుంది.
Click on image to read: