సుప్రీం లాయర్లను రంగంలోకి దింపిన రోజా

తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి  సస్సెండ్ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ విచారణలో ఉంది.  అయితే ఈనెల 5 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఆమె లంచ్ మోషన్ దాఖలు చేశారు. రోజా తరుపున సుప్రీం కోర్టు న్యాయవాది ఇందిరా జయసింగ్‌ వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్దంగా తనను సస్పెండ్ చేశారని రోజా వాదించారు.  బడ్జెట్ సమావేశాలు ఎంతో ముఖ్యమైనవి…తన నియోజకవర్గ ప్రజల తరుపున […]

Advertisement
Update:2016-03-01 11:03 IST

తనను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్సెండ్ చేయడంపై వైసీపీ ఎమ్మెల్యే రోజా న్యాయపోరాటం చేస్తున్నారు. ఇప్పటికే దీనిపై ఆమె హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ విచారణలో ఉంది. అయితే ఈనెల 5 నుంచి బడ్జెట్ సమావేశాలు ఉండడంతో ఆమె లంచ్ మోషన్ దాఖలు చేశారు. రోజా తరుపున సుప్రీం కోర్టు న్యాయవాది ఇందిరా జయసింగ్‌ వాదనలు వినిపించారు. నిబంధనలకు విరుద్దంగా తనను సస్పెండ్ చేశారని రోజా వాదించారు. బడ్జెట్ సమావేశాలు ఎంతో ముఖ్యమైనవి…తన నియోజకవర్గ ప్రజల తరుపున సభలో ఉండాల్సిన అవసరం ఉందని ఆమె కోర్టు దృష్టికి తెచ్చారు. కాబట్టి సభకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. రోజా తరపు వాదనలు విన్న న్యాయమూర్తి తదుపరి విచారణను మూడో తేదికి వాయిదా వేశారు. కేసు వాదన కోసం నేరుగా సుప్రీం కోర్టు న్యాయవాదులను రప్పించడం ద్వారా ఈ వ్యవహారాన్ని రోజా, వైసీపీ సీరియస్‌గా తీసుకున్నట్టు అనిపిస్తోంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News