ఇక మెతుకులు లెక్కపెట్టుకుని తినే ఆ పాత మంత్రం వద్దు!
ఇది వరకు బాగా పిసినారుల విషయంలో… వాడు మెతుకులు లెక్కపెట్టుకుని తింటాడురా…అనే వాళ్లు. ఇప్పుడు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారంతా ఇలాంటి లెక్కలు వేస్తూనే ఉన్నారు. కప్పు రైస్, రెండు పుల్కాలు…ఇన్ని గ్రాముల కూర…ఇలాంటి లెక్కలతో పాటు ఏ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి అనే లెక్కలు చూసుకుని మరీ తింటున్నారు. అయితే ఈ కేలరీల లెక్కలు బరువు తగ్గడంలో మంచి ఫలితం ఇవ్వవని, అంతకంటే ముందు శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు, […]
ఇది వరకు బాగా పిసినారుల విషయంలో… వాడు మెతుకులు లెక్కపెట్టుకుని తింటాడురా…అనే వాళ్లు. ఇప్పుడు బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారంతా ఇలాంటి లెక్కలు వేస్తూనే ఉన్నారు. కప్పు రైస్, రెండు పుల్కాలు…ఇన్ని గ్రాముల కూర…ఇలాంటి లెక్కలతో పాటు ఏ ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి అనే లెక్కలు చూసుకుని మరీ తింటున్నారు. అయితే ఈ కేలరీల లెక్కలు బరువు తగ్గడంలో మంచి ఫలితం ఇవ్వవని, అంతకంటే ముందు శరీరంలో హార్మోన్ల అసమతౌల్యం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పరిశోధకులు, ఒబేసిటీ నియంత్రణ నిపుణులు చెబుతున్నారు.
కేలరీలు లెక్కలు వేసుకుని తక్కువ తినడం అనే పద్ధతి, బరువుని తగ్గించడంలో అంతగా పనిచేయదని వారు చెబుతున్నారు. అలాగే తమకు తాముగా తిండిని తగ్గించుకుని బరువు తగ్గాలి అనుకునేవారిలో 80శాతం మంది విఫలం అయిపోతున్నారని పరిశోధకులు అంటున్నారు. ఎందుకంటే ఈ లెక్కల్లో ఎన్నో అవకతవకలు ఉంటాయట. ఉదాహరణకు ఒక యాపిల్ తింటే 116 కేలరీలు తిన్నట్టు. అదే 200ఎమ్ఎల్ కోలా తాగితే 86 కేలరీలు, ఇక డైట్ కోలాలో అయితే అసలు కేలరీలే ఉండవు…ఇలాంటి ప్రచారాల ఆధారంగా… డైట్ కోలా తీసుకునే వారు ఒక యాపిల్‌లోని సగం కేలరీలను తీసుకుంటున్నట్టే అంటున్నారు వారు.
అందుకే కేలరీలు లెక్కలు వేసుకోకుండా సరిపడా ఆహారం తీసుకుంటూ ఆరోగ్యవంతంగా బరువు తగ్గవచ్చని సూచిస్తున్నారు. నిజానికి ఆహారం కంటే బరువు తగ్గడంలో ప్రధాన పాత్రపోషించేది మన శరీరంలో ఉన్న హార్మోన్లేనని, కొన్ని హార్మోన్లు కొవ్వుని కరిగించడానికి తోడ్పాటు అందిస్తే కొన్ని హార్మోన్లు కొవ్వుని శరీరంలో నిలవ ఉండేలా చేస్తాయని, ఆ హార్మోన్లను సమన్వయంలో, నియంత్రణలో ఉంచితే చాలు. హాయిగా బరువు తగ్గవచ్చనేది వారిమాట.
అంటే కేలరీల లెక్కల కంటే మన శరీరం ఎలా పనిచేస్తుంది….అనే విషయాన్ని తెలుసుకోవడమే చాలా అవసరం. 100 కేలరీలు ఉన్న కోలా తాగితే ఆ మేరకు కొవ్వు పెరుగుతుందట, అదే 100 కేలరీలు ఉన్న యాపిల్ తింటే మాత్రం ఎలాంటి బరువు బాధ ఉండదు. ఇదంతా హార్మోన్ల ప్రభావం. యాపిల్‌ని తింటే అది కొవ్వుని కరిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. అదే కోలా తాగితే కొవ్వుని నిల్వ ఉంచే హర్మోన్లు రిలీజవుతాయి. అలాగే డైట్ కోలా తీసుకుంటే ఆ మేరకు బరువు పెరిగే అవకాశాలు 50శాతం పెరుగుతాయి. అందుకు కారణం ఆ కోలా వలన శరీరంలో విడుదల అయ్యే హార్మోన్లే.
కేలరీలు లెక్కలు వేసుకుని ఫుడ్ తీసుకున్నా, బరువు విషయంలో నిద్ర, ఒత్తిడి కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. మంచి నిద్ర లేనపుడు, ఒత్తిడి ఎక్కువగా ఉన్నపుడు మన శరీర హార్మోన్లలో మార్పులు వస్తాయి. అవి ఆహారంతో సంబంధం లేకుండా బరువుని పెంచుతాయి.
ఆహారం తీసుకునే వేళలు కూడా కేలరీలకంటే ముఖ్యమైనవి. ఉదయం హెవీ బ్రేక్‌పాస్ట్ తీసుకుని రాత్రి డిన్నర్ చాలా లైట్‌గా చేయాలి…అనే సూత్రం పాటించకుండా కేలరీలు మాత్రమే తగ్గిస్తే లాభం ఉండదు. అందుకే ప్రస్తుతం వెయిట్ లాస్ మంత్రం కేలరీలు తగ్గించడం కాదు, న్యూట్రిషన్‌హార్మోనల్ బ్యాలన్స్. ఇది నూతన సైంటిఫిక్ విధానం…. దీన్నే పాటించాలని ఒబేసిటీ నియంత్రణ నిపుణులు సలహా ఇస్తున్నారు.