టీడీపీలో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే
ఫిరాయింపుల విషయంలో ప్రతిపక్ష వైసీపీ చంద్రబాబు క్యారెక్టర్‌నే తప్పుపడుతున్నా… టీడీపీ మాత్రం అవన్నీ పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకున్న టీడీపీ తాజాగా మరో ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించుకుంది. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డేవిడ్ రాజును టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ సీఎం వద్దకు తీసుకొచ్చారు. సీఎంతో భేటీ […]
ఫిరాయింపుల విషయంలో ప్రతిపక్ష వైసీపీ చంద్రబాబు క్యారెక్టర్‌నే తప్పుపడుతున్నా… టీడీపీ మాత్రం అవన్నీ పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు. ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీని పార్టీలో చేర్చుకున్న టీడీపీ తాజాగా మరో ఎమ్మెల్యేను సైకిల్ ఎక్కించుకుంది. ఆదివారం ఉదయం ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టీడీపీలో చేరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. డేవిడ్ రాజును టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావ్ సీఎం వద్దకు తీసుకొచ్చారు. సీఎంతో భేటీ అయిన డేవిడ్ రాజ్ … ఆయనతో చర్చల అనంతరం పార్టీలో చేరారు.
డేవిడ్ రాజుకు పార్టీలు మారడం కొత్తేమీ కాదు. 1999లో సంతనూతలపాడు నుంచి టిడిపి పక్షాన ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్… మొన్నటి ఎన్నికల ముందు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలిపొందారు. ఇప్పుడు మళ్లీ టీడీపీలోకి దూరిపోయారు. డేవిడ్ రాజ్ పార్టీ వీడడంపై వైసీపీ ముందే సమాచారం ఉందని చెబుతున్నారు. డేవిడ్ విషయంలో తొలి నుంచే ఒక అంచనాతో ఉన్న వైసీపీ ఆయనను లైట్ తీసుకుందని చెబుతున్నారు. రెండు రోజుల క్రితమే తాను పార్టీ వీడడం లేదని డేవిడ్ రాజు చెప్పారు. కానీ అంతలోనే రంగు మార్చేశారు. ఇప్పుడు మాత్రం చంద్రబాబు చేసిన అభివృధ్ధిని చూసే తాను పార్టీ వీడుతున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, జలీల్ ఖాన్, జయరాములు, భూమానాగిరెడ్డి, అఖిలప్రియతో పాటు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలో చేరారు.
Click on image to read: