సీఎం అల్లం వర్సెస్ సామాన్యుడి అల్లం
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెద్ద సమస్య వచ్చిపడింది. వ్యవసాయంలో కోట్లు సంపాదిస్తా అని చెప్పిన ఆయన సేద్యానికే ఇప్పుడు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అందుకే ఆయన దిగులు చెందుతున్నారు. కేసీఆర్ తన ఫాం హౌజ్‌లో ఇటీవల 50 ఎకరాల్లో అల్లం సాగు చేశారు. అప్పట్లో కిలో అల్లం ధర 150 నుంచి రూ. 200 వరకు ఉండడంతో మంచి ఆదాయం వస్తుందనుకున్నారు. ఆధునిక పద్దతుల్లో పంట సాగు చేయడంతో బాగానే పండింది. కానీ అల్లం సీఎందైనా […]
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు పెద్ద సమస్య వచ్చిపడింది. వ్యవసాయంలో కోట్లు సంపాదిస్తా అని చెప్పిన ఆయన సేద్యానికే ఇప్పుడు గిట్టుబాటు ధర దక్కడం లేదు. అందుకే ఆయన దిగులు చెందుతున్నారు. కేసీఆర్ తన ఫాం హౌజ్‌లో ఇటీవల 50 ఎకరాల్లో అల్లం సాగు చేశారు. అప్పట్లో కిలో అల్లం ధర 150 నుంచి రూ. 200 వరకు ఉండడంతో మంచి ఆదాయం వస్తుందనుకున్నారు. ఆధునిక పద్దతుల్లో పంట సాగు చేయడంతో బాగానే పండింది. కానీ అల్లం సీఎందైనా మార్కెట్ మాత్రం దళారులదే కదా. అందుకే ఇప్పుడు అల్లం ధర కిలో రూ. 50కి పడిపోయింది. అందుకే సమయం వచ్చినా అల్లం పంటను తీయలేదని చెబుతున్నారు. బహిరంగ మార్కెట్లో మాత్రం 120 వరకు ఉంది. సీఎం అల్లం అమ్ముడుపోకపోవడం అవమానమే కదా!. అందుకే మార్కెటింగ్ శాఖ అధికారులే రంగంలోకి దిగారు. సీఎం అల్లం అమ్మిపెట్టేందుకు చెమట చిందిస్తున్నారు. కనీసం కిలో 100 రూపాయల చొప్పున అమ్మిపెట్టేందుకు నానా పాట్లు పడుతున్నారు. తమ ప్రభావాన్ని ఉపయోగించి వ్యాపారులతో కొనిచ్చే పనిలో ఉన్నారు. అయితే 50 ఎకరాలు అల్లం పంటను కొనేందుకు సంశయిస్తున్నారు. అవసరమైతే ఒకరితోనే కాకుండా పలువురు వ్యాపారులతో అల్లం కొనుగోలు చేయించే పనిలో ఉన్నారు.
సరే సీఎం అల్లం పంటకు నష్టమొచ్చినా దాని వల్ల ఆయనకు ఏమీ కాదు. మరీ ఇలా ఒక్క అల్లం పంటే కాదు ప్రతిపంటలోనూ దళారుల చేతిలో నష్టపోతున్న సామాన్య రైతుల పరిస్థితి ఏమిటీ?. సీఎం అల్లం అనే సరికి అధికారులు కూడా అమ్మిపెట్టేందుకు పోటీ పడుతున్నారు. మరి పేద రైతుల విషయంలో ఈ మాత్రం శ్రద్దపెడితే వారి జీవితాలు ఎప్పుడో బాగుపడేవి. సీఎం అల్లం పంట కిలో 100 రూపాయలకు అమ్మిపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. బాగానే ఉంది. ఆ ధరకు మిగిలిన రైతుల పంటను అమ్మించే ప్రయత్నం చేయరా?. మార్కెటింగ్ అధికారులు కేవలం సీఎం పంట కోసమే పనిచేస్తారా?. సీఎం కేసీఆర్ తన సొంత చేదు అనుభవాన్ని చూసైనా … మద్దతు ధర లేకపోతే ఇక సామాన్య పేద రైతులు ఎంతగా చితికిపోతున్నారో గుర్తిస్తే బాగుంటుంది. దళారి వ్యవస్థను నిర్మూలించి సరైన ధర అందేలా చేస్తే రైతులకు అంతోఇంతో సాయం చేసినవారవుతారు.
Click on image to read: