జమ్మలమడుగు వైసీపీ బాధ్యతలు ఎవరికి?
జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలోకి చేరిపోవడంతో ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై చర్చ మొదలైంది. నేతలు వెళ్లిపోయిన చోట వారికంటే బలమైన నేతను తయారు చేస్తామన్న జగన్ అందుకు తగ్గట్లుగానే ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. నియోజవర్గ ఇన్‌చార్జ్ రేసులో మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ గ్రామ స్థాయి నాయకులను కలుస్తున్నారు. ఆదినారాయణరెడ్డి […]
జమ్మలమడుగు వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణరెడ్డి టీడీపీలోకి చేరిపోవడంతో ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దానిపై చర్చ మొదలైంది. నేతలు వెళ్లిపోయిన చోట వారికంటే బలమైన నేతను తయారు చేస్తామన్న జగన్ అందుకు తగ్గట్లుగానే ముందుకెళ్తున్నారని చెబుతున్నారు. నియోజవర్గ ఇన్‌చార్జ్ రేసులో మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ గ్రామ స్థాయి నాయకులను కలుస్తున్నారు.
ఆదినారాయణరెడ్డి పార్టీ వీడుతారని తెలిసినప్పటి నుంచే సుధీర్ రెడ్డి రంగంలోకి దిగారు. ఆ మధ్య జగన్ జమ్మలమడుగులో పర్యటించినప్పుడు అల్లే ప్రభావతమ్మను జగన్ తన కారులో ఎక్కించుకుని పర్యటన చేశారు. దీంతో ఆమెకు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ సుధీర్ రెడ్డికే ఎక్కువ అవకాలున్నాయని చెబుతున్నారు. అయితే మరికొందరు మాత్రం జమ్మలమడుగు ఇన్ చార్జ్ నియామకంలో వేచి చూసే ధోరణి మంచిదని భావిస్తున్నారు .
ఆదినారాయణరెడ్డి రాకతో టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కాబట్టి రామసుబ్బారెడ్డిని చంద్రబాబు ఎలాంటి పదవితో సంతృప్తి పరుస్తారో చూడాలని… ఒకవేళ చంద్రబాబు ఆ ప్రయత్నంలో విఫలమైతే పరిస్థితులు మరోలా ఉంటాయంటున్నారు. రామసుబ్బారెడ్డిని చంద్రబాబు సంతృప్తి పరచలేని పక్షంలో వచ్చే ఎన్నికల నాటికి ఆయన పార్టీ మారినా ఆశ్చర్యం లేదని కొందరు అంచనా వేస్తున్నారు. ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకుంటే బాగుంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికైతే మైసూరారెడ్డి సోదరుడి కుమారుడు సుధీర్ రెడ్డి పేరు ఇన్ చార్జ్ గా ప్రముఖంగా వినిపిస్తోంది.
Click on image to read: