బాబు మళ్లీ ‘’మన వాళ్లు బ్రీఫ్డ్‌ మీ’’ నా!- టీడీపీలో కొత్త భయం

కూరగాయాల బేరం చేసినంత ఈజీగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనబోయి అడ్డంగా టీడీపీ నేతలు బుక్కయ్యారు.  దేశంలోనే ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తాను నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది.  అయితే ఇప్పుడు ఏపీలోనూ టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఆల్ రెడీ సైకిల్ ఎక్కించింది.  ఆయా జిల్లాల మంత్రులు, కీలక నేతలు నేరుగా రంగంలోకి దిగి వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈ విషయం […]

Advertisement
Update:2016-02-27 07:39 IST

కూరగాయాల బేరం చేసినంత ఈజీగా తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనబోయి అడ్డంగా టీడీపీ నేతలు బుక్కయ్యారు. దేశంలోనే ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించింది. అప్పటి వరకు తాను నిప్పు అని చెప్పుకున్న చంద్రబాబు పరువు బంగాళాఖాతంలో కలిసిపోయింది. అయితే ఇప్పుడు ఏపీలోనూ టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపింది. ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను ఆల్ రెడీ సైకిల్ ఎక్కించింది. ఆయా జిల్లాల మంత్రులు, కీలక నేతలు నేరుగా రంగంలోకి దిగి వైసీపీ ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఈ విషయం టీడీపీ అనుకూల మీడియాలో కూడా వచ్చింది. అయితే ఇప్పుడు టీడీపీ నేతల్లో కొత్త అనుమానాలు బయలు దేరాయి.

ఎమ్మెల్యేలతో చర్చల కోసం ఒకరు ఇద్దరు కాకుండా ఆయా జిల్లాలకు చెందిన పలువురు నేతలకు బాధ్యతలు అప్పగించడంతో కథ అడ్డం తిరిగిందా అన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతోంది. వైసీపీ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతల మంతనాలకు సంబంధించిన సంభాషణలను రికార్డు చేశారా అన్న భయం కొందరిలో కనిపిస్తోంది. ఈ విషయంపై రెండు రోజులుగా సోషల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా టీడీపీ నేతల భయానికి బలం చేకూరుస్తున్నాయి.

తమ పార్టీ ఎమ్మెల్యేలతో ఏఏ టీడీపీ నేత ఏం మాట్లాడారు?.. ఎక్కడ మాట్లాడారు?, ఎంత ఆఫర్ చేశారు? వంటివన్నీ సాక్ష్యాలతో సహా త్వరలోనే బయటపెడుతామని చెప్పారు. ఆడియో, వీడియో టేపులు కూడా బయటకు వస్తాయని చెప్పడంతో కలకలం రేగింది. వెళ్లిపోయిన ఎమ్మెల్యేలకు ఎంత డబ్బు ఇచ్చారు అన్నది కూడా సాక్ష్యాలతో సహా బయటపెడుతామని అంబటి చెప్పారు. అయితే అంబటి రాంబాబు అన్న దాంట్లో నిజం ఎంతుందో తెలియకపోయినా… ఒకవేళ అదే జరిగి ఉంటే పరిస్థితి ఏమిటని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈసారి కూడా ఓటుకు నోటులోలాగా సాక్ష్యాలతో సహా దొరికిపోతే ఇక తమను దేశంలో ఏ నాయకుడు కాపాడే పరిస్థితి ఉండదని భయపడుతున్నారు. కొందరు ఎమ్మెల్యేలతో చంద్రబాబు కూడా మాట్లాడి ఉంటారని భావిస్తున్నారు. ఒకవేళ అదే నిజమై సాక్ష్యాలు బయటకు వస్తే మాత్రం మరో సంచలనమే అవుతుంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News