ప్రత్తిపాటి, కేంద్రమంత్రిపై సాక్షి సంచలనాత్మక కథనం

లక్షల మంది సాధారణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.  తాజాగా సాక్షి పత్రిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఒక కేంద్ర మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో బాధితులకు న్యాయం జరక్కపోవడానికి కారణం సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు అవడమే కారణమంటూ కథనం రాసింది. అందుకు కొన్ని సాక్ష్యాలు కూడా ప్రచురించింది. సంస్థ యాజమాన్యాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగిన […]

Advertisement
Update:2016-02-27 04:16 IST

లక్షల మంది సాధారణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసిన అగ్రిగోల్డ్ కుంభకోణంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా సాక్షి పత్రిక మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు ఒక కేంద్ర మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ బ్యానర్ ఐటమ్ ప్రచురించింది. అగ్రిగోల్డ్‌ కుంభకోణంలో బాధితులకు న్యాయం జరక్కపోవడానికి కారణం సంస్థ యాజమాన్యం, ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు అవడమే కారణమంటూ కథనం రాసింది. అందుకు కొన్ని సాక్ష్యాలు కూడా ప్రచురించింది.

సంస్థ యాజమాన్యాన్ని కాపాడేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వ పెద్దలు … సంస్థతో కుమ్మకై కోట్ల విలువైన భూములను , హాయ్‌ ల్యాండ్‌ను సొంతం చేసుకున్నారని సాక్షి కథనం సారాంశం. అగ్రిగోల్డ్ ఆస్తుల జప్తుకు సరిగ్గా 32 రోజుల ముందు సంస్థకు చెందిన 14. 81 ఎకరాల భూమి ప్రత్తిపాటి పుల్లారావు భార్య పేరున బదిలీ అయింది. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థ డైరెక్టర్ ఉదయ్ దినకర్‌ తో ఈ మేరకు ఒప్పంద పత్రం రాసుకున్నట్టు వెల్లడించింది. అందుకు సంబంధించిన డాక్యుమెంట్ కాపీని కూడా ప్రచురించింది. ఈ భూమి ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో ఉంది.

నూజివీడు మండలం రామన్నగూడెంలో 110. 65 ఎకరాలు, వీరులపాడు మండలం చత్నవరంలో 56. 27 ఎకరాలను ఓ కేంద్రమంత్రి అగ్రిగోల్డ్ తో కుమ్మకై సొంతం చేసుకున్నారని వెల్లడించింది. ఈ భూమి సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తుంది. అత్యంత విలువైన హాయ్‌ ల్యాండ్‌ను ప్రభుత్వంలోని ఒక కీలక నేత సొంతం చేసుకున్నట్టుగా కథనం రాసింది సాక్షి. ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక ఐపీఎస్ ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని లొంగదీసుకుని ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారట. అందుకు ప్రతిఫలంగానే యాజమాన్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని చెబుతోంది.

ఎన్నికలకు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామన్న చంద్రబాబు ఇప్పుడు మాత్రం ఆస్తులపై కన్నేశారని ఆరోపణ. హైకోర్టు పదేపదే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అగ్రిగోల్డ్ విషయంలో సీఐడీ దూకుడుగా ముందుకు వెళ్లలేకపోవడానికి కారణం కూడా ప్రభుత్వ పెద్దల ఒత్తిడేనని చెబుతున్నారు. మొత్తం మీద లక్షలాది మంది పేద, మధ్య తరగతి ప్రజలు తినీతినక కూడబెట్టుకున్న సొమ్ము విషయంలో ప్రభుత్వ పెద్దలు ఇలా వ్యవహరించడం దారుణమన్న విమర్శలు వస్తున్నాయి. పది మంది బాగు కోసం లక్షల మంది జీవితాలు నాశనం చేయడం మానవత్వం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News