ఆపరేషన్ ఆకర్ష్‌పై ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్

చూస్తుంటే ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఇక ఆగిపోయేలా కనిపిస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని పార్టీలోకి చేర్చుకుని వైసీపీని దెబ్బకొట్టామని ఒకవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరపడుతుంటే మరోవైపు కొందరు టీడీపీ సీనియర్‌ నాయకులు చంద్రబాబును కలిసి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మనకు చాలా చెడ్డపేరు తెస్తోందని చంద్రబాబుకు విన్నవించారట! మనకు తగినంతమంది ఎమ్మెల్యేలు వున్నప్పటికి, పరిపాలనను గాడిలో పెట్టాల్సిందిపోయి అనవసరంగా వైసీపీని కెలుకుతున్నామని ప్రజలు అనుకుంటున్నారని, జగన్‌ మన ప్రభుత్వాన్ని పడగొడతానన్నాడు కాబట్టే మనమే వాళ్ల ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నామని […]

Advertisement
Update:2016-02-26 10:53 IST

చూస్తుంటే ఆపరేషన్‌ ఆకర్ష్‌ ఇక ఆగిపోయేలా కనిపిస్తోంది. ఐదుగురు ఎమ్మెల్యేలను, ఒక ఎమ్మెల్సీని పార్టీలోకి చేర్చుకుని వైసీపీని దెబ్బకొట్టామని ఒకవైపు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సంబరపడుతుంటే మరోవైపు కొందరు టీడీపీ సీనియర్‌ నాయకులు చంద్రబాబును కలిసి ఆపరేషన్‌ ఆకర్ష్‌ మనకు చాలా చెడ్డపేరు తెస్తోందని చంద్రబాబుకు విన్నవించారట!

మనకు తగినంతమంది ఎమ్మెల్యేలు వున్నప్పటికి, పరిపాలనను గాడిలో పెట్టాల్సిందిపోయి అనవసరంగా వైసీపీని కెలుకుతున్నామని ప్రజలు అనుకుంటున్నారని, జగన్‌ మన ప్రభుత్వాన్ని పడగొడతానన్నాడు కాబట్టే మనమే వాళ్ల ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నామని చెబుతూ మన మీడియా ఎంతగా ప్రచారం చేసినా జనం నమ్మడంలేదని చంద్రబాబుకు చెప్పారట. ఈ వ్యవహారంలో జగన్‌ బలహీనపడడం కాకుండా జగన్‌ పట్ల ప్రజల్లో సానుభూతి పెరిగిందని సన్నిహిత నాయకులు చంద్రబాబుకు వివరించారని సమాచారం.

వీళ్ల వాదనలను నమ్మలేని చంద్రబాబు ఈ విషయంపై ఇంటెలిజెన్స్‌ రిపోర్టు కోరాడని చెబుతున్నారు. రిపోర్టు అందేవరకు తదుపరి యాక్షన్‌ ఉండకపోవచ్చు అని అంటున్నారు. సన్నిహిత నేతలు చెప్పిందంతా విన్నాక నిజంగా జగన్‌ పట్ల సానుభూతి పెరుగుతోందా? అని ప్రశ్నించిన చంద్రబాబు ఆలోచనలో పడ్డారని అంటున్నారు. ఆ తర్వాత తేరుకున్న చంద్రబాబు ఈ అంశంపై ఒకసారి లోకేష్‌ను కలిసి మాట్లాడండి అని నేతలకు సూచించారని చెబుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News