బావ మ్యానేజ్ చేస్తారు… బామ్మర్ది బూడిద చేస్తారు

2014 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ టీడీపీకి మద్దతివ్వకపోయి ఉంటే… ఆయన మాట విని కాపులంతా టీడీపీకి  ఓటే వేయకపోయి ఉంటే ఈ పాటికి ఏపీలో  చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదన్నది జగమెరిగిన సత్యం. కాపు రిజర్వేషన్లు, ఏటా వెయ్యి కోట్లు అంటూ కాపులను బాబు బాగానే బుట్టలో వేసుకున్నారు. పవన్‌ బహిరంగంగా టీడీపీకి సపోర్టు చేయడంతో టీడీపీకి మరింత ప్లస్ అయింది. మైనస్ నుంచి ప్లస్  ఐదు లక్షల ఓట్లతో బాబు గట్టేక్కేశారు. అయితే కాపులకు ఇచ్చిన […]

Advertisement
Update:2016-02-26 09:44 IST

2014 ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ టీడీపీకి మద్దతివ్వకపోయి ఉంటే… ఆయన మాట విని కాపులంతా టీడీపీకి ఓటే వేయకపోయి ఉంటే ఈ పాటికి ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారు కాదన్నది జగమెరిగిన సత్యం. కాపు రిజర్వేషన్లు, ఏటా వెయ్యి కోట్లు అంటూ కాపులను బాబు బాగానే బుట్టలో వేసుకున్నారు. పవన్‌ బహిరంగంగా టీడీపీకి సపోర్టు చేయడంతో టీడీపీకి మరింత ప్లస్ అయింది. మైనస్ నుంచి ప్లస్ ఐదు లక్షల ఓట్లతో బాబు గట్టేక్కేశారు. అయితే కాపులకు ఇచ్చిన హామీలను బాబు ఎలా నేరవేర్చారో అందరికీ తెలుసు.

కాపులను దువ్వడంలో ఇప్పటికీ చంద్రబాబు ఏమాత్రం తగ్గడం లేదు. మాటలతో కాపులను మెస్మరైజ్ చేస్తున్నారు. గోదావరి జిల్లాలంటే నాకు చాలా ఇష్టం అంటూ పరోక్షంగా కాపులను కాకాపడుతూనే ఉన్నారు. తుని కాపు సభ సందర్భంగా విధ్వంసం జరిగినా దాన్ని జగన్‌ ఖాతాలో వేశారే గానీ అసలు దోషులను పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఇదంతా కాపు ఓటు బ్యాంకు లేకుంటే టీడీపీ ఏమవుతుందో బాబుకు తెలుసు కాబట్టి అలా ముందుకెళ్తున్నారు. కానీ బావ కష్టాన్ని బాలయ్య తన పంచ్‌ డైలాగులతో బూడిద చేసి పారేస్తున్నారు.

పవన్‌ కల్యాణ్ ప్రచారం చేయడం వల్లే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయం తెలిసి కూడా పవన్ కుటుంబసభ్యులను ప్రెస్‌ మీట్ పెట్టి బాలయ్య అవమానించడంపై మెగా ఫ్యాన్స్ రగిలిపోతున్నారు. ఎవరిని ఎక్కడ పెట్టాలో నాకు తెలుసు… నెత్తినెక్కించుకోనూ అంటూ లేపాక్షి ఉత్సవాలకు చిరును ఆహ్వానించే విషయంలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు కాపుల గుండెలు మండేలా చేస్తున్నాయి. మెగా హీరోల ఫ్యాన్స్ మధ్య చిన్నచిన్న విబేధాలు ఉన్నా చిరును బాలయ్య అవమానించడంపై పవన్‌ ఫ్యాన్స్ తో సహా అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిరును బాలయ్య కించపరిచిన విషయం పవన్ దృష్టికి కూడా కొందరు తీసుకెళ్లారని చెబుతున్నారు. బాలయ్యకు అంత అహం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. చిరును బాలయ్య అవమానించడంపై కాంగ్రెస్ నేత, కాపు నాయకుడు సి. రామచంద్రయ్య కూడా తీవ్రంగా స్పందించారు. చిరును విమర్శించే హక్కు బాలకృష్ణకు లేదని మండిపడ్డారు. అసలు లేపాక్షి ఉత్సవాలను బాలయ్య సొంత డబ్బుతో నిర్వహిస్తున్నారా లేక ప్రభుత్వ నిధులతో నిర్వహిస్తున్నారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బాలయ్య వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని రామచంద్రయ్య మండిపడ్డారు.

బాలకృష్ణకు మరీ ఇంత అహంకారం ఎందుకని టీడీపీ కాపు నేతలు కూడా ఆగ్రహంగా ఉన్నారు. చిరును ఉత్సవాలకు పిలవడం ఇష్టం లేకుంటే అంతటితో వదిలేయాలి గానీ … నెత్తినెక్కించుకోను… ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడుతా వంటి వ్యాఖ్యలెందుకని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద బాబు కాపులను మ్యానేజ్ చేస్తుంటే బాలకృష్ణ మాత్రం ఇలా లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు.

Click on image to read:

Tags:    
Advertisement

Similar News