ఎపి బస్సుల్లో ఛార్జీల మోత...తెలంగాణ బస్సులకు ప్రయాణీకుల మొగ్గు!
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పెంచిన బస్సు ఛార్జీలు, దాని ఆదాయం మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ బస్ రూట్లలో ఈ తేడాలు స్పష్టంగా కనబడుతుండటంతో ప్రయాణీకులు తెలంగాణ బస్సులవైపే మొగ్గు చూపుతున్నారు. విజయవాడనుండి హైదరాబాద్ ప్రయాణానికి రెండు బస్ సర్వీసుల మధ్య దాదాపు 60 రూపాయల తేడా వస్తోంది. సమానమైన సౌకర్యాలు ఉన్న బస్సుల ఛార్జీల్లోనే ఈ తేడా కనబడుతోంది. విజయవాడనుండి హైదరాబాద్‌కి వెళ్లే ఎపి గరుడ సర్వీస్ టికెట్ ధర 481 రూపాయలు […]
ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ పెంచిన బస్సు ఛార్జీలు, దాని ఆదాయం మీద ప్రభావాన్ని చూపుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ బస్ రూట్లలో ఈ తేడాలు స్పష్టంగా కనబడుతుండటంతో ప్రయాణీకులు తెలంగాణ బస్సులవైపే మొగ్గు చూపుతున్నారు. విజయవాడనుండి హైదరాబాద్ ప్రయాణానికి రెండు బస్ సర్వీసుల మధ్య దాదాపు 60 రూపాయల తేడా వస్తోంది. సమానమైన సౌకర్యాలు ఉన్న బస్సుల ఛార్జీల్లోనే ఈ తేడా కనబడుతోంది.
విజయవాడనుండి హైదరాబాద్‌కి వెళ్లే ఎపి గరుడ సర్వీస్ టికెట్ ధర 481 రూపాయలు ఉంటే, తెలంగాణలో అదే సర్వీస్ ఛార్జీ 417 రూపాయలు ఉంది. సూపర్ లగ్జరీ, గరుడ ప్లస్, వెన్నెల, ఇంద్ర, డీలక్స్ ఈ బస్సుల చార్జీల విషయంలోనూ ఈ తేడాలున్నాయి. ఎపి గరుడ ప్లస్ బస్సు ఛార్జీ 512 రూపాయలు ఉంటే అదే సదుపాయాలున్న తెలంగాణ బస్సు ఛార్జీ 444 రూ. మాత్రమే ఉంది. ఇంద్ర సర్వీసు ఛార్జీలు రెండు రాష్ట్రాల్లో 411రూ., 377 రూ. ఉంటే, సూపర్ లగ్జరీ విషయంలో 306 రూ, 268 రూ. లుగా ఛార్జీలున్నాయి. సగటున రెండు బస్సు సర్వీసుల చార్జీల్లో 20శాతం తేడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంతో ప్రయాణీకులు సహజంగానే ఎపి ఆర్టీసి పట్ల ఆగ్రహంగా ఉన్నారు.